MTNL Recharge Plan: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, BSNL వంటి టెలికాం నెట్ వర్క్స్ తమ వినియోగదారులను ఆకర్షించుకునేందుకు ప్రత్యేక ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ కస్టమర్లకు ప్రవేశపెడుతున్నాయి. అయితే రీఛార్జ్ ప్లాన్స్ విషయంలో ఈ నాలుగు టెలికాం నెట్ వర్క్స్ మధ్య మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వీటిని మించి మరో టెలికాం నెట్ వర్క్ వినియోగదారుల కోసం స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ (MTNL) మాత్రం అతి తక్కువ ధర అంటే కేవలం రూ. 49 లకే రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. అది కూడా ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో! అయితే ఈ ప్లాన్ లో భాగంగా కస్టమర్లకు దక్కే సదుపాయాలు ఏంటో తెలుసుకుందాం. 


MTNL రూ. 49 ప్లాన్..


మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ (MTNL) ప్రవేశపెట్టిన అతి చౌకైన రీఛార్జ్ ప్లాన్ రూ. 49. ఇది 180 వ్యాలిడిటీతో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా 60 లోకల్ నిమిషాలు కాలింగ్ తో పాటు 20 STD నిమిషాలు ఇవ్వనున్నాయి. ఆ తర్వాత సెకనుకు పైసాను వసూలు చేస్తారు. లోకల్ SMSకు 50 పైసలు, జాతీయంగా రూ. 1.50.. అంతర్జాతీయంగా రూ. 5 వరకు వసూలు చేయనున్నారు.   


అయితే మార్కెట్లో పోటీగా ఉన్న Reliance Jio, Airtel, Vodafone Idea, BSNL టెలికాం నెట్ వర్క్స్ తో పోలిస్తే.. MTNL అతి తక్కువ ధరకు అనగా రూ. 49 ధరకు రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు ఎక్కువ రోజులు 180 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. 


Also Read: iPhone 14 Max Price: ఐఫోన్ 14 మాక్స్ ధర లీక్.. ఎంతో తెలిస్తే షాకే! స్పెసిఫికేషన్‌లు ఇవే


Also Read: Wheat Prices Hiked: ఆకాశాన్నంటుతున్న గోధుమ ధరలు.. కారణం ఏంటంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.