India's Most Desired Brands 2022: దేశంలో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్‌గా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో అవతరించింది. ఈ విషయాన్ని బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ కంపెనీ టీఆర్ఏ (Trust Research Advisory) పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ కంటే జియో ముందుందని ఈ నివేదికలో వివరించింది. 'ఇండియాస్ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్ 2022' పేరిట టీఆర్ఏ సంస్థ విడుదల చేసిన జాబితాలో బ్రాండ్ పటిష్టత ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాస్ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్- 2022 లిస్ట్ ఇదే...


>>టెలికాం విభాగంలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, బీఎస్ఎన్ఎల్ ఉన్నాయి.
>>దుస్తులు విభాగంలో అడిడాస్ తొలి స్థానంలో ఉంది. తర్వాత నైక్, రేమండ్, అలెన్ సోలీ మరియు పీటర్ ఇంగ్లాండ్ ఉన్నాయి.
>>ఆటోమొబైల్ జాబితాలో బీఎండబ్ల్యూ మెుదటి స్థానంలో ఉంది. తరువాత టయోటా, హ్యుందాయ్ మరియు హోండా ఉన్నాయి.
 >>బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల సూచికలో ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2వ స్థానంలో, ICICI బ్యాంక్ 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. 
>>వినియోగదారు ఉపకరణాల ర్యాంకింగ్‌లో కెంట్ అగ్రస్థానంలో ఉండగా, లివ్‌పుర్ మరియు ఒకాయ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
>>వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌లో ఎల్జీ, సోని, శామ్ సంగ్ మొదటి మూడు బ్రాండ్‌లుగా ఉన్నాయి. 


>>భిన్న రంగాల్లో విస్తరించిన గ్రూపుల్లో ఐటీసీ అగ్రస్థానంలో ఉండగా.. టాటా, రిలయన్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
>>ఎనర్జీ విభాగంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) అగ్రస్థానంలో ఉండగా.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), అదానీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
>>ఫుడ్ అండ్ బెవరేజెస్ విభాగంలో అమూల్ టాప్ బ్రాండ్ గా ఉంది. రెండో స్థానంలో నెస్కేఫ్ ఉంది. 
>>ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ వస్తువుల జాబితాలో ఫిలిప్స్ అగ్రస్థానంలో ఉండగా, గాడ్జెట్రీ జాబితాలో Mi, హెల్త్‌కేర్‌లో హిమాలయా, అతిథ్యంలో ఐటీసీ హోటల్స్, తయారీలో ఏసీసీ, రిటైల్‌లో KFC మరియు టెక్నాలజీలో డెల్ తొలి స్థానాల్లో ఉన్నాయి.
>>అమెజాన్, ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్ట్ మరియు గూగుల్ ఇంటర్నెట్ బ్రాండ్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. 


Also Read: Airtel 199 Plan: ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్, 199 రూపాయలకే అన్‌లిమిటెడ్ కాల్స్‌తో ప్రీపెయిడ్ ప్లాన్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook