షేర్ మార్కెట్‌లో కొన్ని షేర్లు ఒక్కోసారి ఊహించని లాభాలు ఆర్జిస్తుంటాయి. ఏ షేర్ మంచిది ఏది కాదనేది నిర్ణయించడం అంత సులభమేం కాదు. కొన్ని షేర్ల ధర తక్కువగా ఉన్నప్పటికీ స్వల్పకాలంలో ఇన్వెస్టర్లకు అత్యధిక లాభాలు ఇస్తుంటాయి. ఆ షేర్ల వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తక్కువకాలంలో ఎక్కువ లాభాలిచ్చే షేర్లనే షేర్ మార్కెట్ పరిభాషలో మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా పిలుస్తారు. షేర్ మార్కెట్‌లో ఇలాంటి షేర్లు చాలానే ఉన్నాయి. ఇవి స్వల్పకాలంలో ఎక్కువ రెట్లు లాభాలిస్తాయి. ఇలాంటిదే ఒక షేర్ దీపావళికి ముందే రెట్టింపు లాభాల్ని తెచ్చిపెట్టింది. 


Filatex Fashion కంపెనీ షేర్ ఒక పెన్నీ స్టాక్. గత నెల ఈ షేర్ భారీగా పెరిగింది. స్వల్పకాలంలోనే కంపెనీ షేర్ రెట్టింపైంది. ఇప్పుడీ కంపెనీ షేర్ విలువ 15 రూపాయలకంటే ఎక్కువే నమోదవుతోంది. Filatex Fashion అనేది సాక్స్ తయారీ కంపెనీ. కేవలం నెల రోజుల వ్యవధిలో ఈ కంపెనీ షేరు అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చింది. నెలరోజుల క్రితం అంటే సెప్టెంబర్ 19వ తేదీన ఈ కంపెనీ షేర్ 6.90 రూపాయలుంది. సెప్టెంబర్ 21వ తేదీన క్లోజింగ్ ధర 8.34 రూపాయలుగా నమోదైంది.


ఆ తరువాత ఈ షేర్ వేగంగా పెరగడం ప్రారంభమైంది. అక్టోబర్ 21 వచ్చేసరికి ఈ షేర్ ధర 15.50 రూపాయలైంది. అంటే నెలరోజుల్లో రెట్టింపు ధర పలికింది. ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర 16.99 రూపాయలు కాగా, 52 వారాల కనిష్ట ధర 3.86 రూపాయలు. ఏడాది వ్యవధిలో కూడా ఈ కంపెనీ షేర్ పెరుగుదల వేగంగానే ఉంది. 


Also read: Flipkart Diwali Offers: OPPO A77 స్మార్ట్‌ఫోన్‌పై మీరు ఊహించని డిస్కౌంట్, ఇవాళే లాస్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook