Business News in Telugu: మరో పదిరోజుల్లో డిసెంబర్ నెలతోపాటు 2023 సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. యూపీఐ నుంచి డీమ్యాట్ అకౌంట్ వరకు మార్పులు చేయాల్సి ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే.. నామినీ పేరును యాడ్ చేసేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. డీమ్యాట్ ఖాతాదారులకు నామినేషన్ కోసం గడువు 3 నెలల పాటు అంటే డిసెంబర్ 31వ తేదీ వరకు గతంలో పొడిగించిన విషయం తెలిసిందే. నామినీ పేరు యాడ్ చేయకపోతే.. మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నిలిచిపోయే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేవిధంగా యూపీఐ యూజర్లకు కూడా అలర్ట్. గత ఏడాది కాలంగా యూపీఐ ఐడీనిని ఉపయోగించని వినియోగదారుల అకౌంట్ డీయాక్టివేట్ అవుతుందని NPCI వెల్లడించింది. డిసెంబర్ 31వ తరువాత ఆ అకౌంట్‌లు పనిచేయవని స్పష్టం చేసింది. ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నట్లయితే.. ఎస్‌బీఐ అమృత్ కలాష్ స్కీమ్ మంచి ఆప్షన్‌. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇది 400 రోజుల ఎఫ్‌డీ స్కీమ్. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే.. బ్యాంక్ నుంచి 7.6 శాతం వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. 


ఎలాంటి ఫైన్ లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఇది అందరికీ తెలిసిందే. అయితే జూలై 31వ తేదీ నాటికి కూడా ఐటీఆర్ ఫైల్ చేయని కస్టమర్‌లు ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు ఫైల్ చేయవచ్చు. లేకపోతే ప్రభుత్వం జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.5 వేల జరిమానాతో ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఏదైనా బ్యాంకులో లాకర్ ఉన్న ఖాతాదారులందరూ సవరించిన లాకర్ ఒప్పందాన్ని సబ్మిట్ చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 31. కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి అప్‌డేట్ చేసిన అగ్రిమెంట్‌ను సమర్పించాలి. లేకపోతే బ్యాంకులో మీ లాకర్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ ఇప్పటికే హెచ్చరించింది. 


Also Read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


Also Read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook