NPS Plans: రానున్న కాలంలో ఇతరులపై ఆధారపడకుండా మీ ఫ్యూచర్‌ను సంరక్షించుకునే అద్భుతమైన ప్లాన్ నేషనల్ పెన్షన్ స్కీమ్. స్థూలంగా ఎన్‌పీఎస్ అని పిలుస్తుంటారు. అయితే ఇందులో యాక్టివ్, ఆటో అనే రెండు ప్లాన్స్ ఉన్నాయి. రెండింటిలో ఏది మీకు సరైందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా ఎన్‌పీఎస్‌ను ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2004లో ప్రారంభించగా..2009లో అందరు ఉద్యోగులకు వర్తింపజేశారు. నెల నెలా చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిటైర్మెంట్ సమయానికి పెద్దమొత్తంలో నగదు చేతికందేలా ప్లాన్ చేసిన బహుళ ప్రాచుర్యం పొందిన పధకమిది. ఏ మాత్రం రిస్క్ లేకుండా అంటే జీరో రిస్క్‌తో హై రిటర్న్స్ ఇచ్చే అందుబాటులో ఉన్న పథకమిది. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవింగ్స్ పథకాల్లో ఇది అత్యంత ఆదరణ పొందింది. కార్పొరేట్ బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీల్లో వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 18-70 ఏళ్ల మధ్యలో వయస్సు ఉన్న ఏ భారతీయుడైనా తమ సర్వీస్ సమయంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుంటుంది. 60 సంవత్సరాలు వచ్చిన తరువాత కొంతమేర నగదు విత్‌డ్రా చేసుకుని మిగిలిన మొత్తాన్ని నెల నెలా పెన్షన్ కింద పొందవచ్చు.


నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో రెండు ఆప్షన్లు


నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతాదారులకు ఎన్‌పీఎస్ యాక్టివ్, ఎన్‌పీఎస్ ఆటో అనే రెండు ప్రత్యామ్నాయాలు కల్పిస్తోంది. ఎన్‌పీఎస్ ఆటో ఆప్షన్ ప్రకారం ఖాతాదారుడు లేదా ఎన్‌పీఎస్ ఎక్కౌంట్ హోల్డర్ తమ డబ్బును వివిధ రకాల ఆర్ధిక అంశాల్లో ఇన్వెస్ట్ చేసుకునే స్వేచ్ఛను కల్పిస్తాడు. అదే ఎన్‌పీఎస్ యాక్టివ్ ప్లాన్‌లో తమ నగదును ఎక్కడ, ఎందులో పెట్టుబడి పెట్టాలో సూచిస్తాడు. 


ఎన్‌పీఎస్ యాక్టివ్ ఆప్షన్


ఈ ఆప్షన్ ద్వారా ఖాతాదారులు తమ నగదును ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఎంత వరకూ పెట్టుబడి పెట్టవచ్చు అనేది ఎంపిక చేసుకునేందుకు వీలుంటుంది. అదే సమయంలో ఈ ఆప్షన్ ద్వారా గరిష్టంగా 75 శాతం నగదును స్టాక్స్‌కు కేటాయించవచ్చు. ఇంతకుముందు ఈ పరిమితి 50 శాతమే ఉండేది. ఇటీవల ఈ పరిమితిని 75 శాతానికి పెంచారు. 


ఎన్‌పీఎస్ ఆటో ఆప్షన్


ఇందులో ఖాతాదారుడికి తమ డబ్బుల్ని మూడు విభాగాల్లో కేటాయింపు చేయవచ్చు. మొదటిది డీఫాల్ట్ మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్. 50 శాతం వరకూ అత్యధికంగా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌కు వీలుంటుంది. ఇక రెండవది కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్. ఇందులో ఈక్వీటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు 25 శాతమే పరిమితి ఉంటుంది. ఇక మూడవది అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్. ఇందులో ఈక్వీటీల్లో 75 శాతం వరకూ గరిష్టంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు.


ఈ రెండు ఎన్‌పీఎస్ యాక్టివ్, ఎన్‌పీఎస్ ఆటో ఆప్షన్ల ప్రకారం ఏది సరైందో ఆలోచించుకుని ఎంచుకోవచ్చు. సాధ్యాసాధ్యాలు పరిశీలించుకుని ఏది అనుకూలమో నిర్ణయించుకోవచ్చు. 


Also read: India post Recruitment 2023: పదో తరగతి చదివితే చాలు, భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, చివరి తేదీ ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook