NPS New Rules in Telugu: దేశంలోని పోస్టాఫీసులు, బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల సేవింగ్ పధకాల్లో అత్యంత ముఖ్యమైంది నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఈ పధకాన్ని మరింత సెక్యూర్ చేసేందుకు పెషన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టూ ఫ్యాక్టర్ అధెంటిఫికేషన్ ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. అదెలాగో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇక మరింత సెక్యూర్ కానుంది. ఈ పధకానికి టూ ఫ్యాక్టర్ ఆధార్ బేస్డ్ అథెంటిఫికేషన్ ప్రవేశపెడుతూ మార్చ్ 15వ తేదీన సర్క్యులర్ జారీ అయింది. ఈ కొత్త సెక్యూరిటీ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక నుంది పాస్‌వర్డ్ ఆధారిత లాగిన్ అయ్యేటప్పుడు ఆధార్ అథెంటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల సీఆర్ఏ సిస్టమ్‌లో అనధికారిక యాక్సెస్ చాలావరకూ తగ్గిపోతాయి. ఈ సెక్యూరిటీ లేయర్ కారణంగా పెన్షన్ స్కీమ్ ఖాతాదారుల మరింత భద్రత కలుగుతుంది. సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలో ప్రస్తుతం ఉన్న పాస్‌వర్డ్ ఆధారిత లాగిన్ ప్రాసెస్‌కు ఆధార్ ఆధారిత లాగిన్ అథెంటిఫికేషన్ ఉంటుంది. 


ఆధార్ అథెంటిఫికేషన్ ఎలాగంటే


ముందుగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ అధికారిక వెబ్‌సైట్ https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html లో వెళ్లాలి. లాగిన్ విత్  PRAIN లేదా IPIN ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా నమోదు చేయాలి. ఇప్పుుడ ఆధార్ అథెంటిఫికేషన్ విండో ఓపెన్ అవుతుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించాలి. అంతే ఎన్‌పీఎస్ ఖాతాకు యాక్సెస్ లభిస్తుంది. 


Also read: Tata Group IPOs: డబ్బులు రెడీగా ఉన్నాయా, టాటా గ్రూప్ నుంచి త్వరలో 6-8 ఐపీవోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి