NPS Benefits: నేషనల్ పెన్షన్ సిస్టమ్ పధకంలో పెట్టుబడికి ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 డి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. సేవింగ్ లేకపోతే ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో భారీగా ట్యాక్స్ కట్ అయిపోతుంటుంది. ట్యాక్స్ సేవింగ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి ఉద్యోగి ఏడాదికి గరిష్టంగా 1.50 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందగలడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం ఏడాదికి గరిష్టంగా 1.5 లక్షల వరకూ సేవింగ్ ఉంటుంది. ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, పీపీఎఫ్ ఎక్కౌంట్ కంట్రిబూషన్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ పేమెంట్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు, మ్యూచ్యువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ , హోమ్ లోన్స్, సుకన్య సమృద్ధి యోజన పధకాలకు ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది. అంటే వీటిలో పెట్టుబడి ద్వారా ఏడాదికి 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. 


నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి ద్వారా సెక్షన్ 80 డి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెడితే 50 వేల రూపాయలు మినహాయింపు పొందవచ్చు. గరిష్టంగా 2 లక్షల వరకూ సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది.


ఎన్‌పీఎస్ పథకంలో నెలవారీ లేదా ఏడాదికోసారి డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. నెలకు 1000 రూపాయలకు ప్రారంభించి 65 ఏళ్లు వచ్చేవరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. నెలకు 5 వేల రూపాయల చొప్పున 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే మీకు 60 ఏళ్ల వయస్సు వచ్చాక 10 శాతం రిటర్న్‌తో 1.12 కోట్లు అవుతుంది. 60 ఏళ్లు వచ్చాక ఒకేసారి 45 లక్షల నగదు చేతికి అందుతుంది. తరువాత నెలకు 45 వేల రూపాయల చొప్పున పెన్షన్ అందుతుంది. 


Also read: EPF Account link: మీ బ్యాంక్ ఎక్కౌంట్‌ను పీఎఫ్ ఎక్కౌంట్‌తో లింక్ చేయడం ఎలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook