Navratri Flipkart Discount offers: మీకిష్టమైన ఐఫోన్ 11 కేవలం 13 వేలకే, ఆఫర్ ఎలాగో తెలుసుకోండి
Navratri Flipkart Discount offers: నవరాత్రి పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 11 ఇప్పటి వరకూ ఎన్నడూ లభించనంత తక్కువ ధరకు లభిస్తోంది. 2019లో లాంచ్ అయిన ఐఫోన్ 11 అత్యధికంగా విక్రయమౌతున్న మోడల్ కూడా.
Navratri Flipkart Discount offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు నవరాత్రి ప్రత్యేక సేల్ నడుస్తోంది. అత్యధికంగా అమ్ముడౌతున్న ఐఫోన్ 11 మీరెవరూ ఊహించని ధరకు లభ్యం కానుంది. కేవలం 13 వేల రూపాయలే ఐపోన్ 11 మీ సొంతం చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
2019లో లాంచ్ అయిన ఐఫోన్ 11 ఇప్పటివరకూ అత్యధికంగా విక్రయమైన ఐఫోన్ మోడల్‌గా ఉంది. ఇప్పుడీ ఫోన్ అతి తక్కువ ధరకే పొందవచ్చు. ఈ ఫోన్‌లో 6.1 ఇంచెస్ లిక్విడ్ రెటీనా హెచ్‌డి డిస్‌ప్లే లభిస్తుంది. ఇది ఏ13 బయోనిక్ చిప్‌సెట్‌తో నడుస్తుంది. వెనుక వైపు 12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమేరా, ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి.
కేవలం 12,999 రూపాయలకే ఐఫోన్ 11
యాపిల్ ఐఫోన్ 11 కంపెనీ గత ఏడాది క్లోజ్ చేసింది. ఎందుకంటే యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 3 5జి విక్రయాల్ని ఐఫోన్ 11 దెబ్బతీస్తోంది. యాపిల్ ఐఫోన్ 11 ఇప్పటి వరకూ ఓ అద్భుతమైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియాన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ ఫోన్‌కు భారీగా రెస్పాన్స్ లభించింది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే..కచ్చితంగా నవరాత్రి సందర్భంగా ఇదే మంచి అవకాశం. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 12,999 రూపాయలకే అందుబాటులో ఉంది.
యాపిల్ ఐఫోన్ 11 పై ఫ్లిప్‌కార్ట్‌లో 2,901 రూపాయలు డిస్కౌంట్ లభిస్తోంది. దాంతో ఈ ఫోన్ ధర 40,999 రూపాయలైంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ఈఎంఐపై 1000 రూపాయల వరకూ 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఈ ఫోన్ ధర 39,999 రూపాయలకు చేరుకుంది.
మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌పై అందిస్తే 27 వేల రూపాయలు ఆఫర్ లభిస్తుంది. కానీ ఈ ఆఫర్ ఎంత వర్తిస్తుందనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఉంటుంది. ఆఫర్ పూర్తిగా వర్తిస్తే ఐఫోన్ 11 మీకు కేవలం 12,999 రూపాయలకే లభించనుంది. ఇటీవల అంటే ఐఫోన్ 14 లాంచ్ తరువాతే ఈ మోడల్‌ను కంపెనీ క్లోజ్ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook