7th pay commission: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.పెరిగిన డీఏ నగదు మొత్తం మార్చ్ నెల జీతంలో జమ అవుతుంది. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమౌతూనే ఉద్యోగల జీతంలో మార్పులపై చర్చ ప్రారంభమైంది. అంటే కొత్త ఆర్ధిక సంవత్సరం ఉద్యోగులకు అద్భుతంగా ఉండనుంది. త్వరలో వేతన సంఘం ప్రక్రియను నిలిపివేసి..కొత్త విధానం ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తోంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పు
ఈ మార్పు ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మారవచ్చని తెలుస్తోంది. తద్వారా ఉద్యోగుల జీతంలో పెరుగుదల ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీర్ఘకాలంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త ఆర్ధిక సంవత్సరంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సమీక్ష ద్వారా పెంచవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్ మెంట్ 2.57గా ఉంది.
జీతంలో 8 వేల వరకూ మార్పు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పు విషయంలో రెండు వాదనలున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రస్తుతం 2.57 నుంచి పెంచి 3కు చేయాలి. దీనివల్ల ఉద్యోగుల బేసిక్ శాలరీ 3000 పెరుగుతుంది. ఇక రెండవ వాదన ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 7వ వేతన సంఘం ప్రకారం 3.68 రెట్లకు పెంచడం. దీనివల్ల ఉద్యోగులకు 8 వేల వరకూ లాభం కలగనుంది.
జీతభత్యాల్లో పెరుగుదల ఇలా
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస జీతం1 8 వేల రూపాయలుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయమైతే ఇది 26 వేలకు పెరుగుతుంది. అయితే ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఏ విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లు, బేసిక్ శాలరీ 18000 రూపాయల చొప్పున 46,260 రూపాయలు అవుతుంది. ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 రెట్లు పెంచితే ఉద్యోగులకు 95,680 రూపాయలు అదనంగా చేతికి అందుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook