Netflix OTT Free: ఓటీపీలు అన్నింటిలో నెట్‌ఫ్లిక్స్ కాస్త ప్రత్యేకం. మల్టిపుల్ స్క్రీన్ షేరింగ్ సాధ్యం కాదు. అదే సమయంలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా స్ట్రీమింగ్ అయ్యేవి ఇందులోనే కావడంతో సహజంగానే క్రేజ్ ఉంటుంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం అంటే అందరూ ఆసక్తి చూపిస్తారు. పరిమితమైన ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే అందనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు నెట్‌ఫ్లిక్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. అంతేకాకుండా రోజుకు నిర్ణీత డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం అందనుంది. ఈ ప్లాన్స్ వ్యాలిడిటీ 70-84 రోజుల మధ్యలో ఉంటుంది. ఓటీటీ ప్రయోజనాలుండే ప్లాన్స్ కోసం చూస్తుంటే ఇదే మంచి ఆప్షన్. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఉచితంగా అందనుంది. అదే సబ్‌స్క్రిప్షన్ నెలకు 199 రూపాయలు. కానీ ఇప్పుడు ఉచితంగా అందుతుంది. 


రిలయన్స్ జియో 1299 ప్రీ పెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. దాంతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు 5 జీ డేటా ఉంటాయి. జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా సేవలు లభిస్తాయి. అంతే కాకుండా మూడు నెలలు నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా అందుతుంది. ఇక మరో ప్లాన్ 1799 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది కూడా 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. మొత్తం డేటా 252 జీబీ వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు లబిస్తాయి. ఇందులో కూడా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ వెర్షన్ ఉచితంగా లభిస్తుంది.


ఇక వోడాఫోన్ ఐడియా 1198 ప్రీ పెయిడ్ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో 140 జీబీ డేటాతో వస్తోంది. ఇందులో కూడా ఆన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా వీక్షించవచ్చు. ఇక వోడాఫోన్ ఐడియా 1599 ప్రీ పెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున వస్తుంది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 


ఇక ఎయిర్‌టెల్ 1798 ప్రీ పెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటాయి. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ వెర్షన్ ఉచితంగా లభిస్తుంది. 


Also read: NEET PG 2024 Results: నీట్ పీజీ 2024 ఫలితాలు విడుదల natboard.edu.in ఇలా చెక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook