Netflix: నెట్‌ఫ్లిక్స్ `స్కిప్ ఇంట్రో`.. ఈ ఒక్క ఆప్షన్‌తో ఎంత సమయం ఆదా అవుతోందో తెలిస్తే షాకవుతారు..
Netflix Skip Intro Option:మొదట యూఎస్, యూకె, కెనడాల్లో మాత్రమే కేవలం 250 సిరీస్‌లకు `స్కిప్ ఇంట్రో` ఆప్షన్‌ని నెట్‌ఫ్లిక్స్ ప్రవేశపెట్టింది. మొదట్లో వెబ్ వెర్షన్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉండేది.
Netflix Skip Intro Option: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌కి 2.2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. యూజర్‌ని ఎంగేజ్ చేసే కంటెంట్ ప్రొడ్యూస్ చేయడంలో నెట్‌ఫ్లిక్స్ మిగతా ఓటీటీల కన్నా ఎప్పుడూ ముందే ఉంటుంది. కాబట్టే ఆ ప్లాట్‌ఫామ్‌కి అంత ఆదరణ ఉంది. అసలు విషయానికొస్తే.. నెట్‌ఫ్లిక్స్‌లో కనిపించే 'స్కిప్ ఇంట్రో' ఆప్షన్‌కి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని ఆ సంస్థ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్‌ఫ్లిక్స్ యూజర్స్ ఒకరోజులో 136 మిలియన్ల సార్లు 'స్కిప్ ఇంట్రో' ఆప్షన్‌ని ప్రెస్ చేస్తారని ఆ సంస్థ తెలిపింది. ఇది 195 సంవత్సరాలతో సమానమని పేర్కొంది. అంటే, ఈ ఆప్షన్ ద్వారా 195 సంవత్సరాల సమయం ఆదా అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ యూజర్స్‌లో ప్రతీ ఏడుగురిలో ఒకరు మొదటి ఐదు నిమిషాల సిరీస్‌ను మాన్యువల్‌గా ఫార్వర్డ్ చేస్తారని తెలిపింది. అందుకే 'స్కిప్ ఇంట్రో' ఆప్షన్‌ని ఇంట్రడ్యూస్ చేసినట్లు వెల్లడించింది.
మొదట యూఎస్, యూకె, కెనడాల్లో మాత్రమే కేవలం 250 సిరీస్‌లకు 'స్కిప్ ఇంట్రో' ఆప్షన్‌ని నెట్‌ఫ్లిక్స్ ప్రవేశపెట్టింది. మొదట్లో వెబ్ వెర్షన్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉండేది. మొబైల్ యాప్‌లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. అయితే యూజర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆగస్టు 2017లో టీవీకి, ఆ తర్వాతి సంవత్సరం మే నెలలో మొబైల్ వెర్షన్‌లోనూ ఈ ఆప్షన్‌ని ప్రవేశపెట్టింది.
Also read: రాజమౌళికి సానుభూతి ఉండదు.. ఆరోగ్యం బాగాలేకపోయినా నాతో షూటింగ్ చేపించారు! స్టార్ హీరో ఫిర్యాదు!!
Also read: SS Rajamouli: ఇంకో 'ఆర్ఆర్ఆర్' సినిమా కూడా ఉంది.. అంతకుమించి కామెడీ ఉంటుంది: రాజమౌళి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook