Netflix charges: ఓటీటీలకు ఇటీవల విపరీతమైన డిమాండ్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి ఇంటర్నేషనల్ సంస్థలతో పాటు.. దేశీయంగా కూడా అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సేవలందిస్తున్నాయి. కరోనా కారణంగా కొత్త సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వడం సాధారణమైంది. దీనితో ఓటీటీ సబ్స్క్రిప్షన్లు భారీగా పెరిగాయి.
అయితే చాలా మంది ఫ్యామిలి, ఫ్రెండ్స్‌లో ఎవరో ఒకరు మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇతరులతో పాస్వర్డ్లు షేర్ చేసుకుంటున్నారు. దీనితో ఒకే సబ్‌స్క్రిప్షన్‌పై చాలా మంది సినిమాలు, షోలు చూడటం వంటివి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల నష్టపోతున్నామనే కారణంతో నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇతరులకు.. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోందట. ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేసి.. ఆ తర్వాత అందరికీ దీనిని వర్తింపజేయనున్నట్లు సమాచారం. ఒక్కో ఎక్స్ట్రా డివైజ్‌కు 2 నుంచి 3 డాలర్ల చొప్పున వసూలు చేసే అవకాశముందని తెలుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా పరిమిత సంఖ్యలో డివైజ్‌లలో లాగిన్‌కు వీలు కల్పిస్తున్నాయి. అయితే కొన్నింటిలో ఒక సారి ఒక డివైజ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ చేసే వీలున్న విషయం తెలిసిందే. వాటన్నింటిలో నెట్‌ఫ్లిక్స్ చాలా ప్రీమియం కావడం గమనార్హం.
Also read: Petrol price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు- హైదరాబాద్, వైజాగ్‌లలో ప్రస్తుత రేట్లు ఇలా..
Also read: Edible Oil Price: వంట నూనెల ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook