FD Rates 2023: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారీ వడ్డీ ఆఫర్.. డబుల్ బెనిఫిట్ పొందండి ఇలా..
Fixed Deposit Interest Rates All Banks: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు భారీ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాదు ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. డీసీబీ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీపై 8.1 శాతం వడ్డీని ఇస్తోంది. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో పూర్తి వివరాలు ఇలా..
Fixed Deposit Interest Rates All Banks: ట్యాక్స్ ఆదా చేసుకోవడంతోపాటు మంచి వడ్డీ లభిస్తుండడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు మొగ్గు చూపుతున్నారు. బ్యాంకులు అత్యధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తూ.. పెట్టుబడి దిశగా ప్రోత్సహిస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు పన్ను ఆదాతో పాటు అధిక రిస్క్ ఈక్విటీ పెట్టుబడి, ఇతర రిస్క్ ఆప్షన్‌ల కంటే సురక్షితమైనది. మీరు రిస్క్ లేకుండా పన్ను ఆదా పెట్టుబడి ఎంపిక కోసం చూస్తున్నట్లయితే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోండి. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.
ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఆఫర్ చేస్తోంది..?
==> డీసీబీ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీపై 8.1 శాతం
==> యాక్సిస్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీపై 7.75 శాతం
==> ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.75 శాతం
==> యెస్ బ్యాంక్ లిమిటెడ్ ట్యాక్స్ 7.75 శాతం
==> హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పన్ను ఆదా చేసే ఎఫ్‌డీపై 7.5 శాతం వడ్డీని ఇస్తుంది
==> ఐసీఐసీఐ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్స్ ఎఫ్‌డీపై 7.5 శాతం వడ్డీ
==> ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 7.5 శాతం వడ్డీని ఇస్తుంది
==> బ్యాంక్ ఆఫ్ బరోడా పన్ను ఆదా చేసే ఎఫ్‌డీపై 7.15 శాతం వడ్డీని ఇస్తుంది
==> ఎస్‌బీఐ బ్యాంక్ 7.5 శాతం వడ్డీని.. పీఎన్‌బీ బ్యాంక్ 7 శాతం వడ్డీని ఇస్తుంది.
ఎంత పన్ను మినహాయింపు లభిస్తుంది..?
మీరు పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలో పెట్టుబడి పెడితే.. ఆదాయపు పన్ను చట్టం 1961 కింద సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. దీని కింద రూ.1.5 లక్షల వరకు తగ్గింపు తీసుకోవచ్చు. అయితే ఈ మినహాయింపు మీకు ఐదేళ్ల మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీలపై మాత్రమే వస్తుంది. మరోవైపు సీనియర్ సిటిజన్లు ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను సెక్షన్ 80టీటీబీ కింద వడ్డీపై రూ.50 వేల వరకు రాయితీని పొందవచ్చు. 2023 ఆర్థిక సంవత్సరానికి ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి మార్చి 31వ తేదీ వరకు చివరి అవకాశం ఉంది.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. ఎంపీ సభ్యత్వం రద్దు..?
Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కథ ముగిసే.. మూడో వన్డేలోనూ గోల్డెన్ డక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి