Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కథ ముగిసే.. మూడో వన్డేలోనూ గోల్డెన్ డక్

Suryakumar Yadav Golden Duck Outs: సూర్యకుమార్ యాదవ్ ఈ పేరు చెబితేనే టీ20ల్లో చితకబాదిన సిక్సర్లే గుర్తుకువస్తాయి. కానీ వన్డేలకు వచ్చేసరికి మాత్రం ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఆసీస్‌తో మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డకౌట్ అయి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 10:01 PM IST
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కథ ముగిసే.. మూడో వన్డేలోనూ గోల్డెన్ డక్

Suryakumar Yadav Golden Duck Outs: టీ20ల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్. అతను క్రీజ్‌లోకి వస్తున్నాడంటే బౌలర్లకు దడ మొదలవుతుంది. ఎలాంటి బంతి వేసినా.. అలవోకగా స్టాండ్స్‌లోకి పంపించగల నైపుణ్యం. మైదానం నలుములలా సిక్సర్ల కొట్టగల సత్తా అతనికి ఉంది. పొట్టి ఫార్మాట్‌లో పరుగుల వరద పారిస్తూ బౌలర్లకు చూపిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. వన్డేలకు వచ్చేసరికి తేలిపోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు.

తొలి రెండు వన్డేల్లో మొదటి బంతికే ఔట్ అయిన సూర్యకుమార్ యాదవ్.. మూడు వన్టేల్లోనూ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఒక సిరీస్‌లో (మూడు మ్యాచ్‌లు) తొలి బంతికే బ్యాట్స్‌మన్ మూడుసార్లు ఔట్ కావడం ఇదే తొలిసారి. మొదటి రెండు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా.. ఈ మ్యాచ్‌లో ఏడవ స్థానంలో పంపించారు. అయినా అతని రాత మారలేదు. 

ఏడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే అష్టన్ అగర్‌కు బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. 36వ ఓవర్ తొలి బంతికి విరాట్ కోహ్లీ ఔట్ కాగా.. సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. అగర్ స్ట్రెయిట్ లెంగ్త్ బాల్ ఎక్కువ పేస్.. కొంచెం తక్కువ.. బ్యాక్‌ఫుట్‌పై షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయి స్టంప్‌లను తాకింది. ఔట్ అయిన తర్వాత సూర్యకుమార్ చాలా నిరాశగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. డగౌట్‌లో కూర్చొని కూడా చాలా సేపు బాధపడుతూ కనిపించాడు. 

ముంబై, విశాఖపట్నంలలో జరిగిన తొలి రెండు వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ చేతిలో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. మూడో వన్డేలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  

 

టీ20 ఇంటర్నేషనల్‌లో దుమ్ములేపిన సూర్యకుమార్.. ఇప్పటివరకు వన్డేల్లో మాత్రం నిరాశపరిచాడు. జూలై 2021లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ 23 మ్యాచ్‌లలో 21 ఇన్నింగ్స్‌లలో 424 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అత్యుత్తమ స్కోరు 64 పరుగులు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా విఫలమవుతున్నా.. జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో జట్టులో స్థానం దక్కించుకున్న సూర్య.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 

అయితే ఇప్పటికప్పుడు సూర్య వన్డే కెరీర్‌కు వచ్చే ప్రమాదం ఏం లేదు. శ్రేయాస్ తిరిగి వచ్చే వరకు సూర్యకుమార్ ఆడతాడని ఇటీవల రోహిత్ శర్మ చెప్పిన విషయం తెలిసిందే. నెటిజన్లు మాత్రం నెట్టింట భారీ ట్రోల్ చేస్తున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి.. అన్యాయం చేస్తున్నారనంటూ టీమ్ మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు.

Also Read: Ind Vs Aus 3rd Odi Updates: కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ బాల్.. షాక్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్  

Also Read: Ind Vs Aus: రాణించిన బౌలర్లు.. భారత్ లక్ష్యం ఎంతంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News