New Hero Electric Prices Start @ Rs 85,000: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ 'హీరో మోటోకార్ప్' తాజాగా కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సింగిల్ బ్యాటరీ, డ్యూయల్ బ్యాటరీ సామర్థ్యంతో మూడు విద్యుత్‌ స్కూటర్లను విడుదల చేసింది. ఆప్టిమా సీఎక్స్‌ 5.0 (Optima CX 5.0), ఆప్టిమా సీఎక్స్‌ 2.0 (Optima CX 2.0), ఎన్‌వైఎక్స్‌ (NYX) ఎలక్ట్రిక్ స్కూటర్లను వదిలింది. ఆప్టిమా సీఎక్స్‌ 5.0, ఎన్‌వైఎక్స్‌ డ్యూయల్‌ బ్యాటరీని కలిగి ఉండగా.. ఆప్టిమా సీఎక్స్‌ 2.0 సింగిల్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ల ధరలు రూ. 85వేల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి రూ.1.30 లక్షల మధ్య ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Optima CX 2.0 Price, Range: 
హీరో ఎలక్ట్రిక్‌ ఈ మూడు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఆధునిక ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన లుకింగ్‌తో తీసుకొచ్చింది. కంపెనీ Optima CX 2.0 మోడల్‌కు 2kWh బ్యాటరీని అందించింది. సింగిల్‌ ఛార్జ్‌తో 89 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. గరిష్ఠంగా 48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ నాలుగున్నర గంటల్లో బ్యాటరీని ఫుల్‌ ఛార్జ్‌ చేయొచ్చు. ఈ స్కూటర్ రెండు రంగుల్లో (మ్యాట్ బ్లూ మరియు చార్‌కోల్ బ్లాక్ కలర్) అందుబాటులో ఉంటుంది. 


Optima CX 5.0 Price, Range:
ఆప్టిమా సీఎక్స్‌ 5.0 ఎలక్ట్రిక్‌ స్కూటర్ 3kWh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ గరిష్టంగా 55 kmph వేగాన్ని అందించడానికి 1.9 kW మోటార్‌కు శక్తినిస్తుంది. సింగిల్‌ ఛార్జ్‌తో 113 కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఆప్టిమా సీఎక్స్‌ 5.0 ఎలక్ట్రిక్‌ స్కూటర్ రెండు రంగుల్లో (డార్క్ మ్యాట్ బ్లూ మరియు మాట్ మెరూన్) అందుబాటులో ఉంటుంది. 


NYX Price, Range:
ఎన్‌వైఎక్స్‌ మోడల్‌లో కూడా CX 5.0లో వినియోగించిన బ్యాటరీనే అందించారు. ఈ మోడల్‌ టాప్‌ స్పీడ్‌ 48 kmph. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ సింగిల్‌ ఛార్జ్‌తో 113 కిలోమీటర్ల రేంజ్‌ వస్తుంది. ఈ స్కూటర్ కూడా రెండేసి రంగుల్లో (చార్‌కోల్ బ్లాక్ మరియు పెరల్ వైట్) వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అన్ని డీలర్‌షిప్‌ల వద్ద ఈ మూడు స్కూటర్లు లభ్యం కానున్నాయి.


Also Read: Ellyse Perry RCB: అందం, ఆటే కాదు.. అంతకుమించి మంచి మనసు ఎల్లిస్ పెర్రీది! ఆ పనికి ఫ్యాన్స్ ఫిదా


Also Read: Honda Shine 100 CC: హోండా సరికొత్త బైక్.. ధర 65 వేలు మాత్రమే! సూపర్ లుకింగ్, బెస్ట్ మైలేజ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి