New Maruti Alto 800: త్వరలోనే 2024 మోడల్ మారుతి ఆల్టో 800 రోడ్లపై రయ్..రయ్, లీక్ అయిన ధర, ఫీచర్స్!
Maruti Suzuki Alto 800 New Model 2024 Price On Road: అతి త్వరలోనే మార్కెట్లోకి మారుతి సుజుకి 800 కొత్త అప్‌డేట్ వేరియంట్ లో అందుబాటులోకి రాబోతోంది అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించక ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Maruti Suzuki Alto 800 New Model 2024 Price On Road: భారతదేశంలో మారుతీ సుజికి కంపెనీకి సంబంధించిన కార్లకి ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో ఈ కంపెనీ లాంచ్ చేసిన మారుతి సుజుకి ఆల్టో 800 కార్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ కారు అత్యంత తక్కువ ధరలోని ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉండడంతో మిడిల్ క్లాస్ కస్టమర్ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకొని అనేక కొత్త కొత్త వేరియంట్స్లో ఈ కారణం రీ లాంచ్ చేసుకుంటూ వచ్చింది. కంపెనీ ఇటీవలే హ్యాచ్‌బ్యాక్ మోడల్ ను నిలిపివేయగా ఆల్టో కస్టమర్స్ కొంత నిరాశకు గురైన సంగతి అందరికీ తెలిసిందే. నిలిపి వేస్తున్నామని ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఆల్టో కార్లకు సంబంధించిన మరో కొత్త విషయం సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టింది. త్వరలోనే మారుతి సుజుకి కంపెనీ ఆల్టో 800 అప్‌డేట్ వెర్షన్ ను లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో లీకైన ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త మారుతి సుజుకి ఆల్టో అనేక రకాల శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా టాప్-ఎండ్ వేరియంట్స్ లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా పవర్ విండోస్, నావిగేషన్, హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా రన్నింగ్ లైట్లు (DRLలు), వీల్ క్యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక మారుతి సుజుకి ఆల్టో 800 సేఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే.. కంపెనీ ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో అప్‌గ్రేడ్ సిస్టంను అందించబోతోంది. అంతేకాకుండా ఈ కారు ABSతో పాటు EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), పార్కింగ్ సెన్సార్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్.. పూర్తి వివరాలు ఇవే..
కొత్త ఆల్టో 800 ఇంజన్ విషయానికొస్తే, ఇది ఎంతో శక్తివంతమైన 796cc BS6 కంప్లైంట్ ఇంజన్‌ను కలిగి కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ కారుకు సంబంధించిన మైలేజీ వివరాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. త్వరలోనే మార్కెట్లోకి రాబోయే ఈ ఆల్టో 800 కొత్త మోడల్ లీటర్ పెట్రోల్ కి దాదాపు 35కు పైగా కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలుగుతుందట. అతి తక్కువ ధరలోనే మంచి మైలేజీ కారును కొనుగోలు చేయాలని వారికి ఈ కారు గొప్ప ఎంపిక భావించవచ్చు.
కొత్త మారుతి ఆల్టో 800 లాంచ్ తేదీకి సంబంధించిన వివరాలు కూడా ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఈ కారుని 2024 సంవత్సరం చివరి నాటికి మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దాదాపు ఈ కారు ధర రూ.5 లక్షల లోపే ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ కారు మార్కెట్లోకి త్వరలోనే లాంచ్ అయితే ఇతర బ్రాండ్లకు సంబంధించిన బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌లకు గట్టి పోటీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్లో టాక్. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే కంపెనీ వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి