February New Rules: ఫిబ్రవరి నుంచి మారిపోతున్న రూల్స్, ఎన్‌పీఎస్, ఫాస్టాగ్, గోల్డ్ బాండ్‌లో మార్పులు
February New Rules: వచ్చే నెల నుంచి చాలా మారుతున్నాయి. ముఖ్యంగా డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో మార్పులు రానున్నాయి. ఎన్‌పీఎస్ నుంచి ఫాస్టాగ్ వరకూ కన్పించే మార్పుల గురించి తెలుసుకుందాం.
February New Rules: ఫిబ్రవరి 2024 నుంచి చాలా నియమ నిబంధనలు మారుతున్నాయి. కొత్త నెల ప్రారంభమౌతూనే వస్తున్న మార్పులతో నేరుగా ఆర్ధిక పరిస్థితిపై ప్రభావం పడనుంది. ఎస్బీఐ స్పెషల్ హోమ్ లోన్ క్యాంపెయిన్, బాండ్స్, ఫాస్టాగ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇలా చాలావరకూ మారిపోతున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.
ఎస్పీఐ హోమ్ లోన్ ఆఫర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక హోమ్ లోన్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు హోమ్ లోన్‌పై 65 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్ ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజుపై డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్రత్యేక డిస్కకౌంట్ ఆఫర్ జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటుంది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డి
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 444 రోజుల ప్రత్యేక ఎఫ్‌డి ప్లాన్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ పేరు ధన్‌లక్ష్మి 444 డేస్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ డెడ్‌లైన్ కూడా జనవరి 31తో ముగుస్తోంది.
ఎన్‌పీఎస్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా
పీఎఫ్ఆర్డీఏ నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే విషయంలో కొత్తగా మార్పులు చేసింది. జనవరి 12న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఎన్ పీఎస్ ఎక్కౌంట్ హోల్డర్లు మొత్తం డిపాజిట్ లో 25 శాతం విత్ డ్రా చేసుకోగలరు. అంతేకాకుండా ఎన్‌పీఎస్ ఎక్కౌంట్ మూడేళ్ల క్రితం ప్రారంభించింది అయుండాలి.
ఫాస్టాగ్ కేవైసీ తప్పనిసరి
నేషనల్ హైవే అథారిటీ కేవైసీ తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తి కాకుంటే ఆ ఫాస్టాగ్స్ పనిచేయవు. అందుకే జనవరి 31లోగా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఐఎంపీఎస్ నిబంధనల్లో మార్పులు
ఫిబ్రవరి 1 నుంచి ఐఎంపీఎస్ నిబంధనల్లో మార్పులొస్తున్నాయి. ప్రస్తుతం లబ్దిదారుని పేరు చేర్చకుండానే 5 లక్షల వరకూ నగదు బదిలీ చేయవచ్చు. అక్టోబర్ 31వ తేదీన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ సర్క్యులర్ జారీ చేసింది. నిబంధనల్లో మార్పులొచ్చిన తరువాత ఎక్కౌంట్ నెంబర్, ఎక్కౌంట్ హోల్డర్ ఫోన్ నెంబర్ చేర్చడం ద్వారా 5 లక్షలు ఒక ఎక్కౌంట్ నుంచి మరో ఎక్కౌంట్‌కు బదిలీ చేయవచ్చు.
సావరీన్ గోల్డ్ బాండ్
సావరీన్ గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువర్ణావకాశం కల్పిస్తోంది. సావరీన్ గోల్డ్ బాండ్ 2023-24 సిరీస్ 4 ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 16 వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు.
Also read: Online Frauds Alert: ఓటీపీ షేర్ చేయకుండానే బ్యాంకు ఎక్కౌంట్లు ఖాళీ, తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook