Upcoming smartphones: ఈ నెలలో విడుదలవనున్న 5 స్మార్ట్ఫోన్లు ఇవే..!
Upcoming smartphones: ఈ నెలలో పెద్ద సంఖ్యలో కొత్త స్మార్ట్ఫోన్లు విడుదల కానున్నాయి. మార్కెట్ వర్గాల ప్రకారం షియోమీ, శాసంగ్, రియల్మీ వంటి సంస్థలు కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Upcoming smartphones: కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ నెలలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాడ్లు రియల్మీ, రెడ్మీ, శాంసంగ్ సహా ఇతర కంపెనీలు భారీగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. మరి ఆ కొత్త ఫోన్ల ధరలు ఎంత ఉండొచ్చు? వాటి ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి? అని విషయాలపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నెలలో రానున్న స్మార్ట్ఫోన్లు
రెడ్మీ 10: షియోమీకి చెందిన రెడ్మీ బ్రాండ్ త్వరలో కొత్త స్మార్ట్‌పోన్‌ను విడుదల చేయనుది. రెడ్మీ 10 పేరుతో దీనిని విడుదల చేయనుంది. బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటపి వరకు ఉన్న వివరాల ప్రకారం.. రూ.8,999గా ఈ స్మార్ట్‌ఫోన్ ధరను నిర్ణయించే వీలుందని తెలుస్తోంది. 50 ఎంపీ రియర్ కెమెరాతో ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
షియోమీ రెడ్మీ కే50
ఇక రెడ్మీలోనే ప్రీమియం సెగ్మెంట్లో రెడ్మీ కే50 పేరుతో మార్చి 17నే మరో ఫోన్ విడుదలయ్యే వీలుంది. అయితే ఇది తొలుత అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదలవ్వచ్చని సమాచారం. ఇండియా మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.
రియల్మీ జీడీ 2 సిరీస్..
రియల్మీ గేమింగ్ ఫోన్ జీటీ 2 సిరీస్‌ను ఈ నెల 22న ఇండోనేషియా మార్కెట్లోకి విడుదల చేయనుంది కంపనీ. అయితే దీనిపై ఇంకా కంపెనీ నుంచి అధికారిక ప్రకట రాలేదు. అదే సమయంలో ఇండియాలోనూ ఈ ఫోన్ విడుదల కావచ్చని తెలుస్తోంది.
రియల్మీ జీటీ నియో 3
రియల్మీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. జీటీ నియో 3 ఈ నెలాఖరున విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్మార్టర్ఫోన్ 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఇదే కాకుండా భారీ కెమెరా కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉండనున్నట్లు అంచనాలు వస్తున్నాయి. అయితే భారత మార్కెట్లో మాత్రం ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ సమయంలో విడుదల కావచ్చని తెలుస్తోంది.
శాంసంగ్ నుంచి రెండు ఫోన్లు..
శాంసంగ్ నుంచి మార్చి 17న రెండు స్మార్ట్ఫోన్లు ఒకేసారి విడుదల కానున్నట్లు తెలిసింది. గెలాక్సీ ఏ 53, గెలాక్సీ ఏ 73 పేర్లతో కొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి విడుదల కానున్నాయట. దీనిపై శాంసంగ్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also read: ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు..
Also read: March 2022 Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు ఇంకా 7 సెలవులు- పూర్తి జాబితా ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook