March 2022 Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు ఇంకా 7 సెలవులు- పూర్తి జాబితా ఇదే..

March 2022 Bank Holidays: బ్యాంక్​లో మీకు ఏదైనా పని ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. రేపటి నుంచి ఈ నెల ముగిసే వరకు బ్యాంకులు మొత్తం 7 రోజులు సెలవులో ఉండనున్నాయి. సెలవుల జాబితా ఇలా ఉంది..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 01:02 PM IST
  • వచ్చే వారాల్లో బ్యాంకులకు భారీగా సెలవులు
  • ప్రాంతాల వారీగా సెలవు దినాల్లో మార్పులు
  • యథాతథంగా ఆన్​లైన్​ సేవలు, ఏటీఎం సర్వీసులు
March 2022 Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు ఇంకా 7 సెలవులు- పూర్తి జాబితా ఇదే..

March 2022 Bank Holidays: మార్చి నెలలో ఇప్పటి 12 రోజులు మగిశాయి. నేడు ఆదివారం (మార్చి 13). ఈ నెలలో బ్యాంకులు మొత్తం 13 సెలవులు ఉండగా.. అందులో 6 సెలవులు (నేటితో కలిపి) ముగిశాయి. ఈ నెలలో ఇంకా 18 రోజులు మిగిలి ఉన్నాయి. 18 రోజుల్లో బ్యాంకులు 7 రోజులు సెలవులో ఉండనున్నాయి.

అయితే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోను బ్యాంకులకు ఈ సెలవులు వర్తించవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రాంతీయ పండుగల సహా ఇతర ప్రత్యేక దినాలనుబట్టి సెలవులు నిర్ణయమై ఉంటాయి.

ప్రస్తుతం బ్యాంకులకు వెళ్లకుండానే చాలా పనులు పూర్తవుతున్నా.. కొన్ని సార్లు కచ్చితంగా బ్యాంక్​కు వెళ్లాల్సి వస్తుంటుంది. అలాంటి పనులేవైనా ఉంటే.. ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇందుకోసం బ్యాంకుల సెలవులు ఎప్పుడు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అందుకే ఈ నెలలో ఇంకా ఎన్ని రోజులు బ్యాంకులు ఉన్నాయి? ఎక్కడ బ్యాంకులు సెలవులో ఉంటాయి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మార్చి చివరి రెండు వారాళ్లో సెలవులు ఇలా..

  • మార్చి 17: హోలికా దహన్​- ఉత్తర్​ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా ఝార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులో ఉంటాయి.
  • మార్చి 18: హోలీ- దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్ల నేడు సెలవు ఉంటుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు ఇప్పటికే సెలవు తేదీని ప్రకటిచినట్లు తెలిసింది.
  • మార్చి 19: హోలీ- మణిపూర్​, బిహార్​, ఒడిశా సహా పలు ఇతర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
  • మార్చి 20: ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు దినం.
  • మార్చి 22: బిహార్​ దివాస్​- ఈ రోజు బీహార్ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది.
  • మార్చి 26: నాలుగో శనివారం అయినందున బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
  • మార్చి 27: ఆదివారం కూడా బ్యాకులకు సాధారణ సెలవు.

నోట్​: బ్యాంకులకు సెలవులు ఉన్నా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు ఆన్​లైన్ సదుపాయాలు అందబాటులో ఉంటాయి. ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ సహా ఐఎంపీఎస్​, యూపీఐ సదుపాయాలు 24x7 అందుబాటులో ఉంటాయి. ఏటీఎంలు కూడా పని చేస్తాయి. కాబట్టి బ్యాంక్​లో ఏదైనా తప్పనిసరి పని ఉంటే తప్పా.. సెలవుల వల్ల సాధారణ వినియోగదారులకు ఎలాంటి ప్రభావం పడదు.

Also read: Todays Gold Rate: పసిడి ప్రియులకు షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, మార్చ్ 13, 2022 ఇవాళ్టి ధరలు

Also read: Amazon Fab Phone Fest: రూ.32,000 విలువైన మొబైల్ ఇప్పుడు రూ.1,649కే అందుబాటులో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News