SBI Alert: ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఎస్‌బీఐ రూ.2 లక్షల ఇన్సూరెన్స్, ఆ పని చేస్తే చాలు
SBI Accidental Insurance | ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే లభించే ఓ ఇన్సూరెన్స్ బెనిఫిట్‌ను ఎస్‌బీఐ తన ఖాతాదారులకు అందిస్తోంది. ఎస్‌బీఐ రుపే ప్లాటినమ్ కార్డుకు అప్లై చేసుకుంటే చాలు.
State Bank of India: తన ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే లభించే ఓ ఇన్సూరెన్స్ బెనిఫిట్‌ను ఎస్‌బీఐ తన ఖాతాదారులకు అందిస్తోంది. ఎస్‌బీఐ రుపే ప్లాటినమ్ కార్డుకు అప్లై చేసుకుంటే చాలు. ఆ కార్డు ద్వారా రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా పొందవచ్చొ ఇక్కడ తెలుసుకుందాం.
ఎస్‌బీఐ రూపే ప్లాటినమ్ కార్డ్ అనేది అంతర్జాతీయం వినియోగించుకునే డెబిట్ కార్డు. దీని ద్వారా క్యాష్‌లెస్ షాపింగ్ చేయవచ్చు తద్వారా ఎస్‌బీఐ రికార్డ్స్ పాయింట్లు మీరు పొందవచ్చు. అయితే సామాన్యులు ఇన్సురెన్స్ ప్రీమియంలు చెల్లించలేరు. వీరితో పాటు అందరికీ కలిసొచ్చేలా రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రయోజనం చేకూరుస్తుంది. ఎస్‌బీఐ రూపే ప్లాటినమ్ కార్డు ద్వారా యాక్సిడెంట్ జరగడానికి ముందు 45 రోజుల్లోపు పీఓఎస్ లేదా ఈకామర్స్‌లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసి ఉంటే చాలు. వారికి పైసా ఖర్చు లేకుండా రెండు లక్షల రూపాయల వరకు ఈ ఇన్సూరెన్స్‌ను ఎస్‌బీఐ అందిస్తుంది.
Also Read: Gold Price Today In Hyderabad: గుడ్ న్యూస్.. మళ్లీ పతనమైన బంగారం ధర, మిశ్రమంగా వెండి ధరలు
ఎస్‌బీఐ రూపే ప్లాటినమ్ కార్డ్ గురించి కొన్ని విషయాలు
- దేశవ్యాప్తంగా ఉన్న 52 లక్షల మర్చంట్ ఔట్‌లెట్స్, ప్రపంచ వ్యాప్తంగా 30 మిలియన్ ఔట్‌లెట్లలో ఎస్‌బీఐ రూపే ప్లాటినమ్ కార్డుతో షాపింగ్ చేయవచ్చు.
- మూవీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. బిల్లులు చెల్లించవచ్చు. ఎస్‌బీఐ రూపే ప్లాటినమ్ కార్డుతో ఆన్‌లైన్‌లో వస్తువులు సైతం కొనుగోలు చేసుకోవచ్చు.
- ఈ కార్డు ద్వారా భారత్‌లో, విదేశాలలోని ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేసుకునే వీలుంది.
Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 24, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం
- ఎస్‌బీఐ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డ్ ఉంటే మీరు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోకి కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది.
- ప్రతి 200 రూపాయల షాపింగ్‌పై మీకు 2 ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్లు అందిస్తోంది ఎస్‌బీఐ. షాపింగ్, పెట్రోల్, డీజిల్‌కు బంక్‌లో చెల్లింపులు, ట్రావెల్ బుకింగ్స్ తదితర విషయాలలో చెల్లింపులకు కార్డు వినియోగించవచ్చు. తొలి మూడు షాపింగ్ ట్రాన్సాక్షన్ పూర్తయితే 200 బోనస్ పాయింట్లు లభిస్తాయి.
- ఎస్‌బీఐ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు మీకు బర్త్‌డే బోనస్ సైతం అందిస్తుంది.
- ఎస్‌బీఐ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డ్ జారీ చేసేందుకు రూ.300 అదనంగా జీఎస్టీ ఛార్జీలు వసూలు చేస్తారు. ఏడాది మెయింటనెన్స్ కింద రూ.250, అదనంగా జీఎస్టీ ఛార్జీ సైతం చెల్లించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook