Nykaa IPO Updates: బ్యూటీ ఉత్పత్తుల ఈ-కామర్స్ కంపెనీ నైకా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్​ (ఐపీఓ) నేటి నుంచి (అక్టోబర్​ 28 గురువారం) ప్రారంభమైంది. ఐపీఓలో విక్రయించే ఒక్కో షేరు ధరను (Nykaa share price) రూ.1,085-రూ.1,125గా నిర్ణయించింది కంపెనీ. మొత్తం రూ.630 కోట్లు సమీకరించే లక్ష్యంతో నైకా ఐపీఓకు వచ్చింది. ఆఫర్ ఫర్ సేల్(Nykaa offer for sale), ఐపీఓ రెండు కలిపి రూ.5,352 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది నైకా. ఈ ఐపీఓ నవంబర్ 1న (Nykaa IPO last date) ముగియనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్ని షేర్లు కొనాలి?


కనీసం ఒక లాట్ కొనాల్సి (Nykaa IPO lot size) ఉంటుంది. 12 ఈక్విటీ షేర్లను కలిపి ఒక లాట్​గా నిర్ణయించింది కంపెనీ.


ఐపీఓ గురించి మరిన్ని విషయాలు..


2.50 లక్షల ఈక్విటీ షేర్లను సంస్థ ఉద్యోగులకోసం (అర్హులైన వారికి మాత్రమే) రిజర్వ్ చేసింది నైకా. 


4,19,72,660 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో విక్రయించింది. వీటి ద్వారా.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.2,369 కోట్లను సమీకరించినట్లు నైకా బుధవారం ప్రకటించింది.


కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ, బ్యాంక్​ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్​ ఇండియా, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, జేఎం ఫినాన్షియల్​, ఐసీఐసీఐ సెక్యూరిటీస్​ ఈ ఐపీఓకు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి.


Also read: Petrol rate in India: దేశంలో ఆగని పెట్రో మంట- కోల్​కతాలో రూ.100 దాటిన లీటర్ డీజిల్ ధర


Also read: LPG Price hike: మరోసారి వంట గ్యాస్ ధరల మంట- వచ్చే వారం రూ.100 వరకు పెరిగే అవకాశం!


నైకా గురించి..


  • నైకా 2012 ముంబయిలో ప్రారంభమైంది. ఫల్గుణి నాయర్​ నైకా (Nykaa founder) వ్యవస్థాపకురాలు. ఆమే ప్రస్తుతం కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో 2000 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు.

  • గత ఆర్థిక సంవత్సరం నైకా (Nykaa income) రూ.2,440 కోట్ల ఆదాయాన్ని గడించింది.  2020-21లో రూ.61.9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

  • నైకా యాప్​కు 43.7 డౌన్లోడ్స్ ఉన్నాయి.

  • ప్రస్తుతం సొంత పోర్ట్​ఫోలియోతో కలిపి మొత్తం 1,500 ఉత్పత్తులను విక్రయిస్తోంది నైకా. ఐపీఓకు వచ్చే ముందే.. డాట్​ అండ్ కీ అనే స్కిన్ కేర్ బ్రాండ్​ను కొనుగోలు చేసింది.

  • పబ్లిక్ ఇష్యూతో కంపెనీ విలువ 7.4 బిలియన్​ డాలర్లకు (రూ.52 వేల కోట్ల పైమాటే) చేరుతుందని అంచనాలు ఉన్నాయి.


Also read: Matchbox Price: అగ్గిపెట్టె రూ.2.. డిసెంబరు 1 నుంచి అమలు!


Also read: 5G Network: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ మరింత ఆలస్యం కానుందా, కారణమేంటి


ఐపీఓలకు క్రేజ్​..


జోమాటో వంటి (Zomato IPO) విజయవంతమైన స్టార్టప్​లు ఐపీఓలో రికార్డు లాభాలను నమోదు చేసిన తర్వాత.. వేరే కంపెనీలు ఐపీఓపై దృష్టి సారించాయి. దీనితో పాటే రిటైల్ ఇన్వెస్టర్లకూ ఐపీఓలపై ఆసక్తి పెరిగింది. దీనితో చాల మంది మంది ఐపీఓలో షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పటికే పెట్టిన ఇన్వెస్ట్​మెంట్ల వల్ల చాలా మంది డబ్బులు లేక ఐపీఓలో షేర్లు కొనలేకపోతున్నారు. అలాంటి వారికి ఎస్​బీఐ బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఇప్పటికే ఉన్న షేర్లను, మ్యూచువల్ ఫండ్లను తాకట్టు పెట్టడం ద్వారా కనీస రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్​మెంట్ రుణాలను ఇస్తోంది.


Also read: PhonePe transaction charges: ఫోన్ పే యూజర్స్‌కి షాక్.. మొబైల్ రీచార్జీపై ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు


Also read: Flipkart: ఇక ఫ్లిప్‌కార్ట్‌లో వ్యవసాయ ఉత్పత్తులు, రైతులతో ఒప్పందాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook