LPG Price hike: మరోసారి వంట గ్యాస్ ధరల మంట- వచ్చే వారం రూ.100 వరకు పెరిగే అవకాశం!

LPG price hike: ఇప్పటికే పెట్రోల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులపై మరో భారం పడనుంది. వచ్చే వారం వంట గ్యాస్ ధర మరింత పెరగొచ్చని తెలిసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 06:19 PM IST
  • సామాన్యులకు మరో షాకింగ్​ న్యూస్​
  • వంట గ్యాస్ ధరలు పెరిగే అవకాశం
  • ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే వారమే పెంపు!
LPG Price hike: మరోసారి వంట గ్యాస్ ధరల మంట- వచ్చే వారం రూ.100 వరకు పెరిగే అవకాశం!

Cooking Gas Price hike: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతోనే (Fuel price hike) తీవ్ర అవస్తలు ఎదుర్కొంటున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. త్వరలో వంట గ్యాస్​ (LPG price hike) ధర మరోసారి పెంచేందుకు చమురు మార్కెటింగ్ సంస్థలు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ధరలు ఇప్పటికే పెరగాల్సి ఉన్నా.. ప్రభుత్వ అనుమతుల కోసం (Cooking Gas price hike) ఆయా సంస్థలు వేచి ఉన్నట్లు తెలిసింది.

ఎంత పెరగొచ్చు?

అంతర్జాతీయంగా రేట్ల ప్రకారం.. వంట గ్యాస్​ ధరలు దేశీయంగా రూ.100 వరకు పెరగాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రభుత్వం నిర్ణయం తర్వాతే దీనిపై స్పష్టత రానుందని వెల్లడైంది. అయితే రిటైల్ ధరలను ప్రభుత్వం నియంత్రించ గలిగినప్పటికీ.. ధరల పెంచకుంటే.. చమురు మార్కెటింగ్ సంస్థలపై పడే అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ఇందుకు అనుమతిస్తే.. ఈ ఏడాదిలో వంట గ్యాస్ ధర పెరగటం ఐదో సారి అవుతుంది. అయితే వచ్చే వారమే ధరల పెంపు ఉండొచ్చని కూడా వార్తల వినిపిస్తున్నాయి.

Also read: Petrol Price Hiked: రెండు రోజుల గ్యాప్​ తర్వాత మళ్లీ పెట్రో బాదుడు- కొత్త ధరల వివరాలు ఇవే

Also read: Adobe Warns employees: ఉద్యోగులకు అడోబ్ హెచ్చరిక- కరోనా టీకా తీసుకోకుంటే జీతం కట్​!

ధరల పెంపు ఎందుకు?

అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో వృద్ధి కారణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర (Crude oil price in Internation market) 85.42 డాలర్లుగా ఉంది.

దీనితో పాటే.. సౌదీ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎల్​పీజీ ధరలు (LPG price in International market) దాదాపు 60 శాతం పెరిగి.. టన్నుకు 800 డాలర్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందవల్లే ధరల పెంపు అనివార్యమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సార్లు వంట గ్యాస్ ధరలను పెంచాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు.

నగరాల వారీగా వంట గ్యాస్ సిలిండర్ (14.2 కేజీ) ధరలు..

హైదరాబాద్​లో రూ.952 వద్ద ఉంది. వైజాగ్​లో సిలిండర్​ ధర రూ.908 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో రూ.899.50 వద్ద, ముంబయిలో రూ.899.50గా ధరలు ఉన్నాయి.

చెన్నై, బెంగళూరు, కోల్​కతా నగరాల్లో సిలిండర్ ధరలు వరుసగా.. రూ.915.50, రూ.902.50, రూ.926 వద్ద ఉన్నాయి. ఈ నగరాలన్నింటిలో వంట గ్యాస్ ధరలు చివరి సారిగా అక్టోబర్ 6న.. రూ.11 నుంచి రూ.15 వరకు పెరిగాయి. అంతకు ముందు.. కూడా జులై, మే, సెప్టెంబర్​ నెలల్లో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.

Also read: Flipkart: ఇక ఫ్లిప్‌కార్ట్‌లో వ్యవసాయ ఉత్పత్తులు, రైతులతో ఒప్పందాలు

Also read: Matchbox Price: అగ్గిపెట్టె రూ.2.. డిసెంబరు 1 నుంచి అమలు!

సామాన్యులు ఏమంటున్నారు?

క్రమంగా పెరుగుతున్న ధరలు వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సామాన్యులు వాపోతున్నారు. ఇప్పటికే రోజూ పెరుగుతూ పోతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు.

Also read: Gold Price Today: మళ్లీ భారీగా పెరిగిన బంగారం, 5 వందల వరకూ పెరుగుదల

Also read: 5G Network: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ మరింత ఆలస్యం కానుందా, కారణమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News