Fuel Prices Hike: ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో ఆ ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగిన తరువాత ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొద్దికాలంగా ఇంధన ధరలు(Fule Prices)పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ ధర ఇప్పటికే సెంచరీ దాటేయగా..డీజిల్ ధర సెంచరీ మార్క్‌కు చేరువలో ఉంది. ఇప్పుడు మరోసారి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ఆయిల్ కంపెనీలు ఆ భారాన్ని ప్రజలపై నేరుగా మోపుతున్నాయి. ఇవాళ తాజాగా మరోసారి పెరగడంతో లీటర్ పెట్రోల్‌పై 29 పైసులు, డీజిల్‌పై 32 పైసలు పెరిగింది. ఫలితంగా హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 106.73 రూపాయలకు చేరుకోగా..డీజిల్ ధర 99.33 రూపాయలకు చేరింది.


నవంబర్ నెల వరకూ ముడి చమురు ఉత్పత్తిని పరిమితంగా చేయాలని ఒపెక్ దేశాలు(Opec Countries) నిర్ణయించాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ డిమాండ్ పెరిగింది. ఈ నేపధ్యంలో నవంబర్ నెల వరకూ ముడి చమురు ధరలు ఏ మాత్రం తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. అంటే మరో రెండు నెలల వరకూ పెట్రోల్-డీజిల్ ధరలు(Petrol-Diesel Prices Hike) పెరుగుతూనే ఉంటాయని అర్ధమౌతోంది. జూలై నెలాఖరు నుంచి ఆగస్టు, సెప్టెంబర్ వరకూ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ (Crued Oil price in international market) ధరలు తగ్గాయి. బ్రెండ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 75 డాలర్ల నుంచి 56 డాలర్లకు పడిపోయింది. అయినా సరే ఆ సమయంలో ధరల స్థిరీకరణ పేరుతో ఇంధన ధరల్ని తగ్గించేందుకు ఆయిల్ కంపెనీలు ఆసక్తి చూపించలేదు. అప్పుడప్పుడూ పైసల్లో తగ్గించడం జరుగుతోంది. గత వారం రోజులుగా మరోసారి అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నాయి.


Also read: SBI PO JOBS Notification 2021: ఎస్బీఐలో భారీగా ఆఫీసర్ ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook