Ola S1 X Electric Scooters Prices and Ranges: ఇండియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో మేజర్ షేర్ సొంతం చేసుకున్న ఓలా కంపెనీ నుండి ఇటీవలే మరో మూడు ఎలక్ట్రిక్ స్కూటీలు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా S1 X సిరీస్ లో లాంచ్ చేసిన స్కూటీలతో పాటు ఓలా S1 ఎయిర్, ఓలా S1 Pro తో కలిపి ఓలా ఎలక్ట్రిక్ స్కూటీల లైనప్ రేంజ్ మొత్తం 5 మోడల్స్‌కి పెరిగింది. 2023 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న లాంచ్ అయిన S1 X సిరీస్ వాహనాలను భారీ స్పందన కనిపించిందని.. లాంచ్ అయిన కేవలం రెండు వారాల వ్యవధిలోనే 75 వేల స్కూటీలకు బుకింగ్ ఆర్డర్స్ లభించాయని ఓలా కంపెనీ ఆనందం వ్యక్తంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతం కంటే మరింత సరసమైన ధరలకే ఓలా ఈ స్కూటీలను లాంచ్ చేయడం కూడా ఈ భారీ స్పందనకు ఒక కారణమైంది. S1 X సిరీస్ లో రూ. 79,999 నుండి రూ. 99,999 ప్రారంభ ధరల వరకు ఈ మూడు వేరియంట్స్ లభించనున్నాయి. 2 kWh వేరియంట్ రూ. 79,999 ధరకే లభిస్తుండటంతో కస్టమర్స్ నుంచి భారీ డిమాండ్ కనిపిస్తోంది.


2023 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాంచ్ అయిన ఓలా  S1 X సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో సెప్టెంబర్‌ నెలలో మొదటి వేరియంట్ స్కూటీలు డెలివరీలు ప్రారంభం కానుండగా.. డిసెంబర్‌ నెలలో మిగిలిన రెండు వేరియంట్స్‌కి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటీల డెలివరి ప్రారంభం కానున్నాయి. లాంచింగ్ సందర్భంగా ప్రకటించిన ఇంట్రడక్టరీ ఆఫర్ ఆగస్ట్ 21 వరకు అమలులో ఉండింది. ఆ తర్వాత ఒక్కో వేరియంట్‌కు కనీసం రూ. 10,000 చొప్పున ధరలను పెంచేలా ఓలా కంపెనీ ప్లాన్ చేసుకుంది.


ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు, ఫీచర్స్, బ్యాటరీ డీటేల్స్ ఇలా ఉన్నాయి.


Ola S1 సిరీస్ ధర
Ola S1 ప్రో: రూ. 1,47,499
Ola S1 ఎయిర్: రూ. 1,19,999
Ola S1 X+: ఆగస్ట్ 21 వరకు రూ. 99,999 కాగా ఆ తరువాత రూ. 1,09,999
Ola S1 X: ఆగస్ట్ 21 వరకు రూ. 89,999 కాగా ఆ తరువాత రూ. 99,999 చార్జ్ చేయనున్నట్టు ఓలా కంపెనీ ఆరంభంలోనే ప్రకటించింది.
Ola S1 X (2kWh): ఆగస్ట్ 21 వరకు రూ. 79,999 కాగా ఆ తరువాతి నుండి రూ. 89,999 చార్జ్ చేయనున్నట్టు ఓలా స్పష్టంచేసింది.


ఓలా S1 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే..
ఓలా S1 ప్రో
కొత్త S1 ప్రో యాక్సిలరేషన్ 2.6 సెకన్ల నుండి 60 కిమీ/గం. సింగిల్ చార్జింగ్ రేంజ్ వచ్చేసి 181 కి.మీ నుండి 195 కి.మీ రేంజ్ ఉంటుంది. ఆగస్టు 15 నుండే కొనుగోలు కోసం బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. సెప్టెంబర్ నెలలో వెహికిల్స్ డెలివరీలు ప్రారంభమవుతాయి.
బ్యాటరీ: 4kWh
రేంజ్ : 195 కిమీ 
గరిష్ట వేగం: 120 kmph


ఓలా S1 ఎయిర్
S1 ఎయిర్ కంటిన్యూవస్ ఔట్‌పుట్ కనిష్టంగా 2.7 kW కాగా గరిష్టంగా 4.5 kW కంటిన్యూయస్ ఔట్‌పుట్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.3 సెకన్లలో 0-40 kmph వేగం అందుకోగలదు. 90 kmph గరిష్ట వేగంతో ప్రయాణించే సామర్ధ్యం ఉంటుంది.
బ్యాటరీ: 3kWh
రేంజ్ : 151 కిమీ
హైయెస్ట్ స్పీడ్ : 90 kmph


ఇది కూడా చదవండి : Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్‌లో లాంచ్ అవుతున్న కొత్త కార్లు, వాటి ఫీచర్స్


ఓలా S1X
ఓలా S1 X అనేది తమ ‘కిల్ ICE’ భావజాలానికి సారాంశమని, భారతీయ స్కూటర్ సెగ్మెంట్‌ను పునర్నిర్వచించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఈవెంట్‌లో S1 X ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చూడ్డానికి మిగిలిన S1 శ్రేణి నుండి భిన్నంగా ఉంటుంది. ఇది పొడవైన హెడ్‌లైట్ కౌల్‌ని కలిగి ఉంది. Ola S1 X 2 kWh, 3 kWh బ్యాటరీ అమర్చారు.
బ్యాటరీ: 2 లేదా 3 kWh
రేంజ్: 151 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది అని ఓలా సంస్థ ప్రకటించింది.
గరిష్ట వేగం: గరిష్టంగా 90 kmph


ఇది కూడా చదవండి : Fastest Bikes in India: ఇండియాలో అత్యంత హై స్పీడ్‌తో దూసుకుపోయే బైక్స్ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి