OLA Electric Scooter price: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు..
Ola ev scooter prices cut: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూట్లర్ల తయారీ సంస్థ ఓలా భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. గతంలో ఏ కంపెనీ ఇంత భారీ డిస్కౌంట్ ఇవ్వలేదు.
Ola electric scooter prices down: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూట్లర్ల తయారీ సంస్థ ఓలా ఈవీ స్కూటర్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. S1 Pro, S1 Air మరియు S1X+ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 25 వేల వరకు తగ్గించింది. దీంతో ఈ స్కూటర్ల ధరలు వరుసగా రూ. 130,000, రూ. 105,000 మరియు రూ. 85,000గా ఉన్నాయి. ఈ ప్రత్యేక తగ్గింపు ఫిబ్రవరి 16 నుంచి ఈ నెలాఖరు వరకు ఉంటుందని ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. గత నెలలో ఇలాంటి ఆఫర్ నే ఓలా ఈవీ తీసుకొచ్చింది. పొడిగించిన వారంటీపై 50 శాతం తగ్గింపు మరియు S1 ఎయిర్ మరియు S1 ప్రో మోడల్‌లపై రూ. 2,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా ఇచ్చింది.
S1 Pro, S1 Air మరియు S1 X+ (3kWh) మోడల్‌లు మాత్రమే ధరలను తగ్గించాయి. గతేడాది డిసెంబరులో S1 X+ మోడల్‌పై రూ.20 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది ఓలా. దీంతో దీని ధర రూ. 99,999 నుండి రూ. 89,999కి దిగొచ్చింది. తాజాగా మరోసారి ధర తగ్గించడంతో రూ. 84,999కి చేరింది. అంతేకాకుండా ఈ నెల ప్రారంభంలో ఓలా సంస్థ 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీని ప్రవేశపెట్టింది. అదనంగా సర్వీస్ సెంటర్స్ ను 50 శాతం విస్తరించేందుకు ఫ్లాన్స్ చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 414 సేవా కేంద్రాలను ఏప్రిల్ 2024 నాటికి సుమారు 600 సెంటర్స్ కు విస్తరించాలని యోచిస్తోంది.
Also Read: Post Office RD Scheme: ఈ పోస్టాఫీస్ స్కీమ్‌తో మీరు లక్షాధికారి కావచ్చు.. లోన్ సౌకర్యం కూడా..
Also Read: Work From Home Jobs: ఈ ఏడు కంపెనీల్లో శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook