Ola Electric Scooter Sales: దేశం మెుత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవాలని అనుకునేవారి కోసం ఈఎంఐ(EMI) ఆప్షన్‌ని పలు బ్యాంకులు అందిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమ్మకాలు రేపటి నుంచే..
ఓలా స్కూటర్‌కి ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్‌ (Pre-bookings‌)ముగిశాయి. 2021 సెప్టెంబరు 8 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో ప్రీ బుకింగ్‌ చేసుకున్న వారు సెప్టెంబరు 8 నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి బైక్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తం సొమ్ము చెల్లించి లేదా ఈఎంఐ పద్దతిలో స్కూటర్‌ని కొనుగోలు చేయవచ్చు.


ఈఎంఐ ఆప్షన్‌
ఓలా స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉండేందుకు పలు బ్యాంకులతో ఓలా సంస్థ (OLA)ఒప్పందం చేసుకుంది. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌, కోటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ మహీంద్రా ప్రైమ్‌, టాటా క్యాపిటల్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, జన స్మాల్‌ ఫైనాన్స్‌,  వంటి పలు బ్యాంకింగ్‌ , ఫైనాన్స్‌ సంస్థలు ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా కనీస ఈఎంఐ రూ. 2,999గా నిర్ణయించారు. 


Also Read: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదల.. ఫీచర్స్ అదుర్స్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181కి.మీ!


అక్టోబరు నుంచి డెలివరీ
సెప్టెంబరు 8 నుంచి ఓలా వెబ్‌సైట్‌(OLA Website) ద్వారా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలు చేసిన వారికి అక్టోబరులో డెలివరీ ఇస్తామని ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ మార్కెటింగ్‌ చీఫ్‌ వరుణ్‌ దుబే తెలిపారు. షోరూం వ్యవస్థ లేనందున నేరుగా కస్టమర్ల ఇంటికే ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు వస్తాయంటూ చెప్పారు. బైక్‌ను కొనుగోలు చేసే సమయంలోనే డెలివరీ ఎప్పుడిస్తామనే వివరాలు కస్టమర్‌కి వెల్లడిస్తామని ఓలా ప్రతినిధులు తెలిపారు. ఓలా సంస్థకు తమిళనాడు(Tamil Nadu)లో భారీ స్కూటర్‌ తయారీ ఫ్యాక్టరీ ఉంది.


ఫీచర్స్‌
ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఎస్‌ 1, ఎస్‌ 1 ప్రో అంటూ రెండు వేరియంట్ల(Two Variants)లో అందిస్తున్నారు. వీటిలో 8.5 కిలోవాట్‌ మోటార్‌, 3.97 కిలోవాట్‌ పర్‌ అవర్‌ ‍బ్యాటరీని అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 నుంచి 115 కిలోమీటర్లుగా ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 121 నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు,  కేవలం మూడు సెకన్లలో 40 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోగలదు. ఇందులో ఎస్‌ 1 ధర రూ. 99,999లుగా ఉండగా ఎస్‌ 1 ప్రో ధర రూ.1,29,000లుగా ఉన్నాయి. ఓలా స్కూటర్‌ పది రంగుల్లో లభిస్తోంది.


Also Read: Simple One Electric Scooter: ఓలాకు పోటీగా 'సింపుల్ వన్' ఈ-స్కూటర్ లాంచ్...ఫీచర్స్ అదుర్స్..ధర ఎంతో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook