Ola to release 3 Electric Bikes with starting Price of Rs 85 Thousand: భారత మార్కెట్‌లో 'ఓలా'కు మంచి డిమాండ్ ఉంది. ఓలా ఎస్1 (Ola S1) ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కొనసాగుతోంది. ఇప్పుడు ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఓ నివేదిక ప్రకారం..  వేర్వేరు ధరల శ్రేణులతో మూడు ఎలక్ట్రిక్ బైక్‌లను ఓలా తీసుకురాబోతోంది. వీటికి ఓలా అవుట్ ఆఫ్ ది వరల్డ్, ఓలా పెర్‌ఫార్మాక్స్ మరియు ఓలా రేంజర్ అని నామకరణం పెట్టారట. ఓలా 'అవుట్ ఆఫ్ ది వరల్డ్' ప్రీమియం ఎంపికగా ఉంటుంది. ఇది గరిష్ట రేంజ్ మరియు గరిష్ట వేగాన్ని కలిగిఉంటుంది. ఇందులో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 85 వేలుగా ఉండబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ola Out of the World:
ఓలా 'అవుట్ ఆఫ్ ది వరల్డ్' ఫుల్ ఛార్జ్‌పై 174 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వనుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా 110 kmph వేగంతో దూసుకుపోగలదు. ఈ మోడల్ కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధర దాదాపుగా రూ.1,50,000లుగా ఉంటుంది. భద్రత కోసం ఈ ఇ-బైక్ సాధారణంగా ఖరీదైన కార్లలో కనిపించే ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్) ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.


Ola Performax:
ఓలా పెర్‌ఫార్మాక్స్.. మిడ్-రేంజ్ బైక్. ఈ ఎలక్ట్రిక్ బైక్ మూడు వేరియంట్లలో వస్తుంది. దీని ఎంట్రీ-లెవల్ వేరియంట్ 91 కిమీ పరిధి మరియు 93 కిమీ గరిష్ట వేగాన్ని పొందబోతోంది. ఈ వేరియంట్ ధర రూ. 1,05,000 ఉండవచ్చు. అదే మోడల్ రెండవ వేరియంట్ 133 కిమీ పరిధి మరియు 95 kmph గరిష్ట వేగంతో వస్తుంది. ఈ బైక్ ధర రూ.1,15,000 ఉండవచ్చు. ఓలా పెర్‌ఫార్మాక్స్ టాప్ వేరియంట్ ధర రూ. 1,25,000. ఇది 174 కిమీ పరిధితో గంటకు 95 కిమీ గరిష్ట వేగాన్ని పొందవచ్చు.


Ola Ranger: 
మూడింటిలో చౌకైన ఎలక్ట్రిక్ బైక్‌గా ఓలా రేంజర్‌ నిలవనుంది. దీని ధర రూ.85,000 నుంచి మొదలై రూ.1,05,000 వరకు ఉండవచ్చు. ఇది మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియంట్ 80 కిమీ పరిధిని మరియు 91కిమీల గరిష్ట వేగాన్ని అందిస్తోంది. మధ్య వేరియంట్ ధర రూ. 95,000. 117 కి.మీ పరిధి మరియు 91 కి.మీ గరిష్ట వేగంతో ఉంటుంది. ప్రీమియం వేరియంట్ 153 కిమీ పరిధిని కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 91 కిమీ.


Also Read: Mohammed Siraj Tilak: మహ‌మ్మ‌ద్ సిరాజ్.. నువ్ ఆడుతుంది భారత జట్టుకు, పాకిస్థాన్‌కు కాదు! మండిపడుతున్న ఫాన్స్  


Also Read: Cheapest Electric Car 2023: చౌకైన ఎలక్ట్రిక్ కారు.. పూర్తి ఛార్జీతో 315 కిమీ ప్రయాణం! 20 వేల మందికి మాత్రమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.