Cheapest Electric Car 2023: చౌకైన ఎలక్ట్రిక్ కారు.. పూర్తి ఛార్జీతో 315 కిమీ ప్రయాణం! 20 వేల మందికి మాత్రమే

Tata Cheapest Electric Car is Tata Tiago, It Gives 315 KM on Full Charge. టాటా మోటార్స్ తన చౌకైన ఎలక్ట్రిక్ కారు 'టాటా టియాగో' ఈవీని అక్టోబర్ 2022లో విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.8.49 లక్షలు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 4, 2023, 03:11 PM IST
  • చౌకైన ఎలక్ట్రిక్ కారు
  • పూర్తి ఛార్జీతో 315 కిమీ ప్రయాణం
  • 20 వేల మందికి మాత్రమే
Cheapest Electric Car 2023: చౌకైన ఎలక్ట్రిక్ కారు.. పూర్తి ఛార్జీతో 315 కిమీ ప్రయాణం! 20 వేల మందికి మాత్రమే

Tata Tiago Electric Car Gives 315 KM on Full Charge: భారత మార్కెట్‌లో 'టాటా మోటార్స్'కి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడంలో టాటా ముందంజలో ఉంది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికిల్ అత్యధికంగా అమ్ముడవుతోంది. టాటా మోటార్స్ తన చౌకైన ఎలక్ట్రిక్ కారు 'టాటా టియాగో' ఈవీని అక్టోబర్ 2022లో విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.8.49 లక్షలు. ఈ ధర కేవలం మొదటి 20 వేల మంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాంతో మొదటి రోజు ఏకంగా 10,000 బుకింగ్‌లు వచ్చాయి. ఇప్పటివరకు బుకింగ్‌ల సంఖ్య 20,000లను దాటింది.

ఇటీవలే టాటా మోటార్స్ కంపెనీ టాటా టియాగో ఈవీ డెలివరీని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ టియాగో ఈవీ యొక్క డెలివరీలను ప్రారంభించినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. భారతదేశంలోని 133 నగరాల్లోని వినియోగదారులకు మొదటి రోజున మొదటి 2,000 యూనిట్ల ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లను డెలివరీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

టాటా టియాగో ఈవీ నాలుగు ట్రిమ్‌లలో వస్తుంది. XE, XT, XZ+ మరియు XZ+ Tech Lux. ఈ ట్రిమ్‌లు బ్యాటరీ ప్యాక్ మరియు ఛార్జింగ్ ఆధారంగా విభజించబడ్డాయి. ఈ కార్లు రెండు బ్యాటరీ ప్యాక్ (9.2kWh మరియు 24kWh) ఎంపికలను కలిగి ఉన్నాయి. 19.2 kWh బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై 250 కిమీలు, 24kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై 315 కిమీ ప్రయాణం చేయొచ్చని కంపెనీ పేర్కొంది.

ఛార్జింగ్ కోసం మొత్తం 4 ఆప్షన్లు ఇచ్చారు. 7.2kW ఛార్జర్‌తో 3.6 గంటల్లో 10-100% ఛార్జ్ చేయవచ్చు. 15A పోర్టబుల్ ఛార్జర్‌తో 8.7 గంటల్లో 10 నుంచి 100% వరకు ఛార్జ్ చేయబడుతుంది. అదేవిధంగా DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 58 నిమిషాల్లో 10 నుంచి 100% వరకు ఛార్జ్ చేయవచ్చు. 

Also Read: AC Price Down: వేసవి ప్రారంభానికి ముందు శుభవార్త.. సగానికి తగ్గిన ఏసీ ధరలు!

Also Read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News