Old Pension Scheme: ఓపీఎస్ అమలుకు సన్నాహాలు.. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొండిచేయి
National Pension System: పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం షాక్ ఇస్తోంది. ఎన్‌పీఎస్ నిధులు తిరిగి చెల్లించేందుకు అంగీకారం తెలపడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాలో ఓపీఎస్ అమలుపై డైలామాలో పడుతున్నాయి.
National Pension System: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా చర్చిస్తున్న విషయం ఇదే. వివిధ రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం అమల్లోకి తీసుకువస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు తమకు కూడా అమలు చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్న రాష్ట్రాలు తమకు ఎన్‌ఎపీఎస్ నిధులు తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకున్నాయి. అయితే ఈ నిధులు తిరిగి ఇచ్చేది లేదంటూ మోదీ సర్కారు తిరస్కరిస్తోంది.
ఇటీవల రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ సర్కారు పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నిబంధనలు రూపొందిస్తోంది. అయితే ఎన్‌పీఎస్ నిధులను పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. జాతీయ పెన్షన్ పథకం కింద ఉద్యోగులకు ఇచ్చే జీతం, డీఏలో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో 5,24,72 ఓపీఎస్ అకౌంట్లు ఉన్నాయి. రూ.14,171 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయగా.. ఉద్యోగుల ఖాతా నుంచి రూ.14,167 కోట్లు కట్ అయింది. దానికి వడ్డీ మొత్తం కలిపితే ఈ నిధులు మొత్తం రూ.40,157 కోట్లకు చేరాయి. ఈ డబ్బులు తిరిగి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరాగా.. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ నోటిఫికేషన్ మార్చాలని చూస్తున్నారు.
కొత్త, పాత పెన్షన్ పథకానికి చాలా వ్యత్యాసం ఉందని.. ఓల్డ్ పెన్షన్ విధానం పునరుద్దరించాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఓపీఎస్‌లో పదవీ విరమణ సమయంలో తాము చివరగా పొందిన జీతంలో సగం డబ్బును ఉద్యోగులు పెన్షన్‌గా పొందుతారు. కొత్త పెన్షన్ స్కీమ్‌లో ఉద్యోగి బేసిక్ శాలరీ 10 శాతం+డీఏ మినహాయిస్తారు. పాత పెన్షన్ స్కీమ్‌లోని ఉద్యోగుల జీతం నుంచి డబ్బు కట్ అవ్వదు. అదే కొత్త పెన్షన్ స్కీమ్‌లో 6 నెలల తర్వాత డియర్‌నెస్ అలవెన్స్ పొందాలనే నిబంధన లేదు. ఈ స్కీమ్‌లో కచ్చితమైన పెన్షన్‌కు హామీ లేదు.
Also Read: Kenya Deaths: భయానక ఘటన.. జీసస్‌ను కలిసేందుకు ఆకలితో అలమటించి 47 మంది ఆత్మహత్య..!
మరోవైపు ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు ఎన్‌పీఎస్‌లోనే మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉద్యోగుల పెన్షన్ విధానాన్ని సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలోని కమిటీ పెన్షన్ విధానంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఎన్‌పీఎస్‌లో మార్పులు చేర్పులు చేయనుంది. ఈ నివేదిక ఆధారంగా ఓపీఎస్‌లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Ajinkya Rahane IPL: రఫ్పాడిస్తున్న అజింక్యా రహానే.. ఆ టైమింగే వేరప్పా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి