Stock Market Updates: స్టాక్​ మార్కెట్లు సోమవారం (Stocks closing bell) భారీ నష్టాలతో ముగిశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 949 పాయింట్లు కోల్పోయి.. 56,747 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nifty) 265 పాయింట్ల నష్టంతో 16,931 వద్ద స్థిరపడింది.


ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోకి ఎంట్రీ ఇవ్వడం సహా.. కేసులు భారీగా పెరుగున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ బలహీన పడింది. ఇప్పటి వరకు దేశంలో 21 ఒమిక్రాన్ కేసులు బయటపడగా.. సగానికిపైగా నిన్న ఒక్క రోజే గుర్తించడం గమనార్హం.


దాదాపు అన్ని రంగాలు నష్టాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, ఐటీ రంగాలపై ఈ తీవ్రత అధికంగా ఉంది.


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 57,781 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. రికార్డు స్థాయిలో అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 56,687 కనిష్ఠానికి పడిపోయింది.


నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,216 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 16,908 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.


లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..


బీఎస్ఈలో కీలక 30 షేర్లూ నష్టాలను మూటగట్టుకున్నాయి.


ఇండస్​ ఇండ్ బ్యాంక్ 3.66 శాతం, బజాజ్ ఫిన్​సర్వ్​ 3.25 శాతం, భారతీ ఎయిర్​టెల్ 2.97 శాతం, టీసీఎస్​ 2.88 శాతం, హెచ్​సీఎల్​టెక్ 2.88 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.


ఆసియాలో ఇతర మార్కెట్లు..


ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. సియోల్​ (దక్షిణ కొరియా) సూచీ లాభాలను గడిచింది. 
 షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), థైవాన్​, హాంకాంగ్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.


కాస్త పెరిగిన రూపాయి..


డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 26 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75.42 వద్ద కొనసాగుతోంది.


Also read: Digital payment: డిజిటల్ లావాదేవీల జోరు- 12 నెలల్లో 53 శాతం వృద్ధి!


Also read: Gold Rate: అత్యంత స్వల్పంగా పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook