Digital payment: డిజిటల్ లావాదేవీల జోరు- 12 నెలల్లో 53 శాతం వృద్ధి!

Digital payment: దేశంలో డిజిటల్ పేమెంట్స్​ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో సాధించిన వృద్ధిని మించి.. గడిచిన 12 నెలల్లో పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 02:20 PM IST
  • దేశంలో డిజిటల్ లావాదేవీల జోరు
  • ఐదేళ్ల వృద్ధిని మించి గత 12 నెలల్లో పెరుగుదల
  • వివరాలు వెల్లడించిన ఆర్​బీఐ ఉన్నతాధికారి
Digital payment: డిజిటల్ లావాదేవీల జోరు- 12 నెలల్లో 53 శాతం వృద్ధి!

Digital payment: గడిచిన 12 నెలల్లో డిజిటల్ లావాదేవీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆర్​టీజీఎస్​, సహా ఇతర డిజిటల్ పేమెంట్​ లావాదేవీల సంఖ్య, విలువ..  గత  ఐదేళ్లలో సాధించిన వృద్ధిని మించి (Digital payments Growth in India) పెరిగింది.

ఈ విషయాన్ని ఆర్​బీఐ (RBI) పేమెంట్స్​ అండ్​ సెటిల్మెంట్​ సిస్టమ్స్​ చీఫ్​ జనరల్ మేనేజర్​ పి.వాసుదేవన్​ వెల్లడించారు. పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నిర్వహించిన డిజిటల్​ మనీ కాన్ఫరెన్స్​లో (PCI Digital Money) ప్రసంగించిన ఆయన ఈ వివరాలు పేర్కొన్నారు.

గత 12 నెలల్లో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య 53 శాతం పెరగ్గా.. విలువ 28 శాతం పెరిగినట్లు తెలిసింది. ఇక గత ఐదేళ్లలో చూస్తే.. డిజిటల్​ లావాదేవీల సంఖ్య 42 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం లావాదేవీలు ఇలా..

దేశంలో ప్రస్తుతం రోజువారీగా సగటున 21.79 కోట్ల లావాదేవీలు (Daily Digital payments in India) జరుగుతున్నాయని వాసుదేవన్​ తెలిపారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గత ఏడాది డిసెంబర్​లో ఆర్​టీజీఎస్​ సేవలను 24x7 పని చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. దీనితోపాటు అనేక సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు.

పేమెంట్​ వ్యవస్థలైన ఎన్​ఏసీహెచ్​, భారతీ బిల్​ పేమెంట్​ వంటివి వారాంతాల్లో కూడా పేమెంట్ సెటిల్మెంట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు వాసుదేవన్​​. వారంలో సెటిల్మెంట్ల సంఖ్యను 200కు పెంచినట్లు వివరించారు. దీని ద్వారా క్రెడిట్​, సెటిల్మెంట్​, రిస్క్​ స్థాయిలో భారీగా తగ్గినట్లు స్పష్టం చేశారు.

పేమెంట్ వ్యవస్థ భారీ వృద్ధి..

దేశంలో పేమెంట్ వ్యవస్థ భారీ వృద్ధి సాధించినట్లు వాసుదేవన్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్​ఫేస్​ (యూపీఐ)తో డిజిటల్ లావాదేవీలు పెరగినట్లు చెప్పారు. యూపీఐ లావాదేవీల సంఖ్య ఈ ఏడాది అక్టోబర్​లో రికార్డు స్థాయిలో 421 కోట్లకు పెరిగినట్లు గుర్తు చేశారు. నవంబర్​లో ఈ సంఖ్య 418 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించారు.

యూపీఐ పేమెంట్స్​ గత ఏడాదితో పోలిస్తే.. అక్టోబర్​లో 100 శాతం పెరిగినట్లు తెలిసింది. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.7.7 లక్షల కోట్లకు సమానం అని వెల్లడైంది.

డిజిటల్​ లావాదేవీలపై పార్లమెంట్​లో ప్రకటన..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో.. ఎలక్ట్రానిక్స్​ అండ్ ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ (ఐడీ) శాఖ సహాయ మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​ డిజిటల్ లావాదేవీలపై ప్రకటన చేశారు.

2018-19లో 3134 కోట్ల లావాదేవీలు (సంఖ్య పరంగా) జరిగినట్లు వెల్లడించారు. 2019-20లో ఈ సంఖ్య 4572 కోట్లుగా నమోదైనట్లు చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ మధ్య వరకు డిజిటల్ లావాదేవీల సంఖ్య 4683 కోట్లకు చేరినట్లు వివరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్య 5554 కోట్లకు పెరిగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

Also read: Gold Rate: అత్యంత స్వల్పంగా పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి

Also read: OLA Electric Car: ఓలా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News