Peon To Richest Man Success Story: ఒకప్పుడు ప్యూన్.. ఇప్పుడు 88 వేల కోట్లకు అధిపతి
ఒకప్పుడు ప్యూన్‌గా పనిచేస్తూ ఇంటి అద్దె చెల్లించే పరిస్థితి లేక గోదాంలో తలదాచుకున్న అతడు ఇవాళ 88 వేల కోట్ల ఆస్తులకు అధిపతి. భారతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలలో అతడొక భాగం.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఇండియాలో ఉన్న రిచెస్ట్ బిజినెస్‌మేన్లలో అతడి సీరియల్ నెంబర్ 45. ఇంతకీ అతడు ఎవరు, అతడి సక్సెస్ స్టోరీ ఏంటో తెలిస్తే.. మీరు కూడా మీ ఆలోచనలకు పదును పెట్టడం గ్యారెంటీ.
Peon To India's 45th Richest Man, Success Story: జీవితం ఎవ్వరిని, ఎప్పుడు ఎటు తీసుకెళ్తుందో.. ఏ తీరాలకు చేర్చుతుందో ఎవ్వరికీ తెలియదు. కష్టాలు ఎన్ని ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జీవితంలో ఉన్నతి కోసం కృషి చేస్తే కచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావు. మనిషి శక్తి సామర్థ్యాలకు హద్దులు, సరిహద్దులు అంటూ ఏమీ లేవు. నీ ప్రతిభను కొలిచే సాధనం అంటూ ఏదీ లేదు. నువ్వు తెలుసుకోవాల్సిందల్లా నీ ఆ ప్రతిభను ఒక క్రమ పద్ధతిలో ఎలా పెట్టాలా అనేదే.
మనం దేశంలో విరివిగా అమ్ముడుపోతూ, ఎప్పుడూ లాభాల్లో ఉండే బిజినెస్ ఏదైనా ఉందా అంటే అది అధెసివ్స్ అండ్ డైకెమికల్స్ బిజినెస్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం వినియోగిస్తున్న ఫెవికాల్, ఫెవిక్విక్, ఎం-సీల్ వంటి ఉత్పత్తులు తయారీ రంగం అన్నమాట. ఈ రంగంలో పిడిలైట్ ఇండస్ట్రీస్ కంపెనీదే పై చేయి. కాదు కాదు.. మొత్తం సామ్రాజ్యం వాళ్లదే అని చెప్పుకోవచ్చు. కానీ ఫెవికాల్, ఫెవిక్విక్, ఎం-సీల్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తోన్న పిడిలైట్ ఇండస్ట్రీస్ యజమాని రియల్ స్టోరీ ఏంటో.. అతడు ఆ బిజినెస్ ఎలా స్థాపించాడో తెలిస్తే మీరు పక్కా షాక్ అవుతారు. సినిమాకు ఏ మాత్రం తగ్గని రియల్ స్టోరీ అతడిది. ఆ సక్సెస్ స్టోరీ తెలిస్తే మీరు కూడా ఆలోచనలో పడిపోతారు.
ఒకప్పుడు ప్యూన్‌గా పనిచేస్తూ ఒక స్నేహితుడికి చెందిన గోదాంలో తన కుటుంబంతో తలదాచుకున్న అతి సామాన్యుడు.. ఇప్పుడు 88,000 కోట్ల ఆస్తులకు అధిపతి. ఇంట్లోవాళ్లు తనని తాతలా లాయర్ అవ్వాలని లా చదువుకోవడానికి ముంబైకి పంపిస్తే.. ఆ లా చదువు అంటేనే ఇష్టం లేని ఆ యువకుడు ముంబైలో ఏదో సాధించాలనే కోటి ఆశలతో ఆ మహా నగరంలో కాలు మోపాడు.
అది స్వాతంత్రోద్యమం ఉపుమీదున్న రోజులవి. దేశానికి స్వాతంత్య్రం కోసం యావత్ దేశం గాంధీ బాటలో నడుస్తున్న కాలం. అప్పుడే ఈ నవ యువకుడు కూడా ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీలో చదువుకుంటూ గాంధీజి క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌కి ఆకర్షితుడయ్యాడు. లా చదువుని మధ్యలోనే ఆపేసి తన సొంత రాష్ట్రం వెళ్లి అక్కడ క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు పలు ఇతర సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆ తరువాత తన లా డిగ్రీని పూర్తి చేసేందుకు మళ్లీ ముంబైకి బయల్దేరాడు.
తాతలా నువ్వు కూడా లాయర్‌వి కావాలనేది ఇంట్లో వాళ్ల బలమైన కోరిక. కానీ లా అంటే అస్సలే ఇష్టం లేదు కానీ ముంబైలోనే ఏదో సాధించాలి అనేది ఆ యువకుడి కల. మొత్తానికి ఇష్టానికి వ్యతిరేకంగానే లా డిగ్రీ పూర్తిచేశాడు. కానీ ఆ న్యాయవాద వృత్తితో పాటే తన జీవితంలోకి వచ్చిన అబద్ధాలను ఆ యువకుడు ఎంతో కాలం మోయలేకపోయాడు. ఆ అబద్దాల జీవితంతో రాజీ పడలేక తన కుటుంబం ఇష్టానికి వ్యతిరేకంగా తన న్యాయవాద వృత్తికే రాజీనామా చేశాడు.
జీవితంలో మొదటిసారి ఒట్టి చేతులతో గమ్యం తెలియక ఏదో చౌరస్తాలో నిలబడినట్టుగా ఉంది అతడికి. ఎదగాలి అనే కలలు అయితే చాలా ఉన్నాయి కానీ ఎటుపోవాలో.. ఏ మార్గంలో వెళ్లాలో తెలియదు. ఆ అయోమయంలోనే చేతిలో ఏ పని లేని రోజుల్లోనే కాంతాబాయితో అతడికి పెళ్లయిపోయింది. పెళ్లితో పాటే వచ్చిన సంసార బాధ్యతలు అప్పులను కూడా మోసుకొచ్చాయి. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఒక కలప వ్యాపారి ఆఫీసులో ఫ్యూన్‌గా పనికి చేరాడు. చేతిలో లా డిగ్రీ ఉన్నా.. ఆ పని చేయడానికి మనసొప్పుకోలేదు. మనసు చంపుకుని మళ్లీ లాయర్ వృత్తిని చేయలేక చివరకు ఫ్యూన్‌గా పనిలో చేరాడు. ఆ సమయంలో ఫ్యూన్‌గా పని చేస్తే వచ్చే జీతంతో ఇల్లు కిరాయి కట్టలేక తన స్నేహితుడికి చెందిన గోదాంలో తన భార్యతో కలిసి తలదాచుకున్నాడు. భర్తను, భర్త మనస్తత్వాన్ని, అతడు పడుతున్న పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ అర్థాంగి కూడా ఏనాడూ అతడిని ఇబ్బంది పెట్టకుండా అతడి వెంటే సర్దుకుపోయింది. ఫ్యూన్‌గా పని చేస్తే వచ్చే డబ్బులతో ఇల్లు గడవడం కష్టంగా ఉందన్న ఆలోచనతో ఆ ఉద్యోగం వదిలేసి మరో చోట ప్రింటింగ్ అండ్ డైయింగ్ ప్రెస్‌లో పనికి చేరాడు.
ఆఫీసులో ఫ్యూన్‌గా పనిచేసినా.. లేక ప్రింటింగ్ ప్రెస్‌లో మరో పనిచేసినా.. ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా.. తను కలలు కనడం మాత్రం ఆపలేదు. ఏదో సాధించాలన్న తన తపన చావలేదు. కాలం కలిసొస్తుందని మంచి రోజుల కోసం వెయిట్ చేయలేదు. ఇక్కడ పనిలో భాగంగా ఆ యువకుడికి కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు పని చూసుకునే చోట బిజినెస్‌మేన్లతో కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. అలా ఓసారి పనిలో భాగంగా జర్మనీకి వెళ్లే అవకాశం వచ్చింది. తన జర్మనీ ప్రయాణాన్ని కేవలం పనిలా కాకుండా ఒక బిజినెస్ టూర్‌లా ఉపయోగించుకున్నాడు. వ్యాపారానికి కావాల్సిన మెళకువలు, ఐడియాలు ఒంటబట్టించుకుని తిరిగొచ్చాడు.
అలా 1954లో బట్టలపై ప్రింటింగ్‌కి సంబంధించిన ఓ కంపెనీలో పనిచేసే క్రమంలోనే ఆ యువకుడికి జీవితంలో మొదటిసారి బ్రేక్ లభించింది. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తాను కలలుగన్న ముంబైలోనే జాకబ్ సర్కిల్లో పరేఖ్ డైకెమ్ ఇండస్ట్రీస్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టి జీవితంలో తన కలలు సాధించుకునే దిశగా తొలి అడుగు వేశాడు. ఇక్కడే తన సోదరుడితో కలిసి టెక్స్‌టైల్ ప్రింటింగ్‌కి అవసరమయ్యే పిగ్మెంట్ ఎమల్షన్స్ తయారు చేసే వ్యాపారం ప్రారంభించారు. ఆ తరువాత 1959 లో పిడిలైట్ పేరుతో ఇండస్ట్రియల్ కెమికల్ కంపెనీని స్థాపించారు. అప్పుడు ఈ యువకుడు స్థాపించిన పిడిలైట్ ఇండస్ట్రీస్ తయారు చేసిన ఫెవికాల్ ఉత్పత్తులకు దేశంలోని కార్పెంటర్స్ నుంచి మండి రెస్పాన్స్ లభించింది.
ముంబైలో ఒక చిన్న దుకాణం నుండి బయటికొచ్చిన ఫెవికాల్‌కి కస్టమర్స్ బ్రహ్మరథం పట్టారు. అతికొద్ది కాలంలోనే అదొక ఫేమస్ ప్రోడక్ట్ అవడమే కాదు.. ఆ వ్యాపారాన్ని భారీ సక్సెస్ చేసింది కూడా. ఆ రంగంలో ఫెవికాల్ మొదటి ఉత్పత్తి కావడంతో దేశంలో అదొక పోటీ లేని మోనోపలి బిజినెస్ అయిపోయింది. మోనోపలి అంటే ఇక ఏకఛత్రాదిపత్యమే అన్నమాట. ఆ తరువాత ఇదే పిడిలైట్ ఇండస్ట్రీస్ ఫెవిక్విక్, ఎం-సీల్ పేరిట మరో రెండు ఉత్పత్తులను తీసుకొచ్చింది. ఆ రెండూ కూడా ఫెవికాల్ బాటలోనే సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇంకేం.. అది మొదలు ఆ నడివయస్కుడు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అతడి పేరే బల్వంత్ పరేఖ్. గుజరాత్‌లోని భావ్ నగర్ అతడి సొంత రాష్ట్రం.
ఇది కూడా చదవండి : First Jobs of Famous Billionaires: లక్షల కోట్లకు పడగలెత్తిన ఈ వ్యాపారుల మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా ?
ఒకప్పుడు ప్యూన్‌గా పనిచేస్తూ ఇంటి అద్దె చెల్లించే పరిస్థితి లేక గోదాంలో తలదాచుకున్న అతడు ఇవాళ 88 వేల కోట్ల ఆస్తులకు అధిపతి. భారతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలలో అతడొక భాగం.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఇండియాలో ఉన్న రిచెస్ట్ బిజినెస్‌మేన్లలో అతడి సీరియల్ నెంబర్ 45. అంటే మన దేశంలో ఉన్న తొలి 50 మంది కుబేరులలో బల్వంత్ రాయ్ కళ్యాణ్‌జీ పరేఖ్ కూడా ఒకరు. కన్‌ఫ్యూజ్ అవకండి.. అది అతడి పూర్తి పేరు. పేరుకి తగినట్టే ఎంతో బలవంతుడు కదా !! బల్వంత్ పరేఖ్ కి ఉన్న మరో గొప్పతనం ఏంటో తెలుసా ? ఇండియాకు స్వాతంత్య్రం లభించిన తరువాత మన దేశం చూసిన అతి కొద్ది మంది తొలి తరం సెల్ఫ్‌మేడ్ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యువర్స్‌లో బల్వంత్ కూడా ఒకరు.
ఇది కూడా చదవండి : Hotel Waiter To IAS Officer: హోటల్లో వెయిటర్‌గా పనిచేసుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు
ఎక్కడ ప్యూన్.. ? ఎక్కడ రిచెస్ట్ బిజినెస్‌మేన్.. ? ఇప్పుడు చెప్పండి మీ కలలకు, మీ ప్రతిభకు సరిహద్దులున్నాయా ? అబద్ధం అంటే గిట్టక తాను చదువుకున్న లా పట్టా జోలికి కూడా పోకుండా అనుకున్నది సాధించడం కోసం ఒక నిజాయితీపరుడు సాగించిన అంతులేని సమరం ఇది. ప్యూన్‌గా అయినా పనిచేస్తాను కానీ గొప్పగా బతకడం కోసం అబద్ధం చెప్పలేను అనే ఒక నిజాయితీపరుడి సక్సెస్ స్టోరీని మీకు అందించాలన్న నా ప్రయత్నం మీకు నచ్చితే.. మీ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ సక్సెస్ స్టోరీని మరో నలుగురికి చేరవేయండి. ఏమో ఎవరికి తెలుసు... ఏ సక్సెస్ స్టోరీ ఎవరిని తట్టిలేపుతుందో.. ఎవరిని ఏ విజయ తీరాలవైపు అడుగేసేలా చేస్తుందో... ఎవ్వరో వచ్చి మనలోని ప్రతిభను గుర్తించరు.. మన ప్రతిభను మనమే గుర్తించాలి.. మనమే సాన పట్టాలి. ఇలాంటి మరిన్ని మోస్ట్ ఇన్‌స్పైరింగ్ సక్సెస్ స్టోరీస్ కోసం కీప్ రీడింగ్ జీ తెలుగు న్యూస్ --- మీ పవన్
ఇది కూడా చదవండి : Highest Salary: టాటా కంపెనీలో రోజుకు 30 లక్షల జీతం.. అతడు సీఈఓ కాదు.. ఐఐటి స్టూడెంట్ అసలే కాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి