ONDC vs Amazon and Flipkart: ఈ కామర్స్ పేరు చెబితే చాలు వెంటనే గుర్తొచ్చేవి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్. ప్రపంచ ఈ కామర్స్ మార్కెట్‌లో మెజార్టీ వాటా ఈ రెండింటిదే. ముఖ్యంగా ఇండియాలో దాదాపు ఆన్‌లైన్ వ్యాపారమంతా ఈ రెండు సంస్థలదే. అందుకే వీటి ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మరో ఈ కామర్స్ వేదిక పేరు ఓఎన్‌డీసి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రముఖ ఈ కామర్స్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు మార్కెట్‌లో ఆధిపత్యం కారణంగా చిన్న చిన్న వ్యాపారస్థులకు నష్టం చేకూరుతోంది. చిన్నా చితకా వ్యాపారులు ఆన్‌లైన్ వ్యాపారంలో ఈ కామర్స్ సంస్థలకు కమీషన్ చెల్లించలేకపోతున్నారు. అలాగని ఆఫ్‌లైన్ వ్యాపారంలో రాణించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెజాన్ విదేశీ కంపెనీ కావడం, ఫ్లిప్‌కార్ట్‌లో విదేశీ కంపెనీ భాగస్వామ్యం ఉండటం వల్ల దేశ ఆర్దిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా రేటింగ్, రివ్యూస్ ఎక్కువగా ఉన్న వస్తువుల్నే ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. ఈ రెండింటినీ తమ చేతుల్లో ఉంచుకునే దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఇక ధరల్లో కన్పించే మాయాజాలానికి అంతే ఉండదు. దీనిపై నియంత్రణ సాధ్యం కావడం లేదు. 


అందుకే దేశంలోని చిన్నా చితకా వ్యాపారులకు ప్రయోజనం కల్పించేందుకు, దేశ ఆర్ధిక వ్యవస్థపై విదేశీ ఈ కామర్స్ కంపెనీల ప్రభావం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ కామర్స్ వేదికను ప్రారంభించింది. అదే ఓఎన్ డిసి. అంటే ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దేశంలోని చిన్న చిన్న వ్యాపారులు కూడా అతి తక్కువ కమీషన్ చెల్లించి ఓఎన్‌డిసి నెట్‌వర్క్ ద్వారా క్రయ, విక్రయాలు జరుపుకోవచ్చు. ఇందులో రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. విక్రయాలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంటే తక్కువ ఛార్జి ఉంటుంది. 


భవిష్యత్‌లో ఈ కామర్స్ వ్యాపారం మరింతగా పెరగనుండటంతో దేశీయ వ్యాపారాన్ని, దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా 5 రాష్ట్రాల్లో ఓఎన్‌డిసి ప్రారంభించింది. దీనికి ప్రత్యేక యాప్ అవసరం లేదు. యూపీఐ నుంచి ఓఎన్‌డిసి‌కు యాక్సెస్ కావచ్చు. స్విగ్గీ, జొమాటో తరహాలో హోటల్స్ నుంచి నచ్చిన ఫుడ్ ఇంటికి తక్కువ ధరకే రప్పించుకోవచ్చు.


Also read: Upcoming IPO: డిసెంబర్ నెలలో విడుదలవుతున్న టాప్ 7 ఐపీవోలు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook