OnePlus 10T 5G launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ 10టి 5జి స్మార్ట్‌ఫోన్ ఇవాళే లాంచ్ అయింది. లాంచ్ సందర్భంగా వన్‌ప్లస్ ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహిస్తోంది. గెలిచితే ఈ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా లభిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. OnePlus 10T 5G ఇవాళ అంటే ఆగస్టు 3వ తేదీన లాంచ్ అయింది. అయితే ధర ఇంకా తెలియలేదు. లాంచ్ సందర్భంగా వన్‌ప్లస్ సంస్థ ఓ వినూత్న ఆఫర్ ప్రకటించింది. వన్‌ప్లస్ లాంచ్ చేసిన ఈ 5జి స్మార్ట్‌ఫోన్ కాంటెస్ట్‌లో గెలిస్తే పూర్తి ఉచితంగా ఫోన్ సొంతం చేసుకోవచ్చు.


వన్‌ప్లస్ 10టి 5జి స్మార్ట్‌ఫోన్ ఉచితంగా లభిస్తుందంటే ఆశ్చర్యంగా ఉందా..ఇది నిజమే. వన్‌ప్లస్ సంస్థ స్వయంగా ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. మీరు చేయాల్సిందల్లా ఇవాళ లాంచ్ చేస్తున్న వన్‌ప్లస్ 10 టి 5జి స్మార్ట్‌ఫోన్ ధర ఎంతో గెస్ చేస్తే చాలు. మీ అంచనా నిజమైతే..OnePlus 10T 5G పూర్తిగా ఉచితంగా గెల్చుకోవచ్చు. ఈ ఆఫర్ ఇంకా కొద్ది గంటలే మిగిలుంది. 


OnePlus 10T 5G ఇవాళ అంటే ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఇండియాలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ కంపెనీ అధికారిక యూట్యూబ్, వెబ్‌సైట్‌పై లైవ్ స్ట్రీమ్ కానుంది. 


OnePlus 10T 5G ఫీచర్లు


వన్‌ప్లస్ 10టి 5జి క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ప్రోసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో తొలిసారిగా 16 జిబి ర్యామ్ ప్రవేశపెడుతున్నారు. ఈ ఫోన్‌లో 8 ఛానెల్ వేపర్ ఛాంబర్ ఉంటుంది. ఇది మీ ఫోన్‌ను పూర్తిగా కూల్‌గా ఉంచుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ హీటెక్కదు. వన్‌ప్లస్ 10 టి 5జి స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 హెర్ట్జ్ టచ్ శాంపిలింగ్ రేట్, హెచ్‌డిఆర్ 10 ప్లస్ సపోర్ట్ ఉంటుంది. 


ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రేర్ కెమేరా సెటప్‌తో వస్తోంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 766 ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమేరా ఉన్నాయి. ఫ్రంట్ కెమేరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. వన్‌ప్లస్ 10 టి 5జి లో 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ఎక్కడా లేదు. ఈ ఫోన్ 4800 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 


Also read: Oppo A77 Smartphone: ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్, ధర, ప్రత్యేకతలు ఇలా



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook