OnePlus 11R Pre-booking and Sale Date: వన్‌ప్లస్ 11R 5G ఫోన్ కోసం ఆత్రుతగా వేచిచూస్తున్న వారికి గుడ్ న్యూస్ రానే వచ్చింది. ఇండియాలో ఈ ఫోన్ ఈ నెలాఖరున.. అంటే ఫిబ్రవరి 28న విక్రయాలు ప్రారంభించనుంది. కానీ ఫోన్ ఫీచర్స్ కస్టమర్స్‌ని టెంప్ట్ చేస్తుండటంతో వన్‌ప్లస్ కంపెనీ తమ కస్టమర్స్ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28న ఫోన్ సేల్స్ ప్రారంభం కానుండగా.. అంతకంటే వారం ముందు నుంచే.. అంటే ఫిబ్రవరి 21 నుంచే వన్‌ప్లస్ 11R 5G ప్రీ-బుకింగ్ ప్రారంభించనుంది. ఫోన్ సేల్స్ ప్రారంభం కాగానే షిప్పింగ్, వగైరా లాంటి ఆలస్యం లేకుండా వెంటనే ఫోన్ చేతికి వచ్చేందుకు ఇది సులువైన మార్గం కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్‌ప్లస్ 11R 5G ఫోన్ రెండు వేరియంట్స్‌లో రానుంది. అందులో 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ఫోన్ ధర రూ 39,999 కాగా 16GB + 256GB వేరియంట్ ఫోన్ రూ. 44,999 గా ఉండనుంది. అమేజాన్, వన్‌ప్లస్ స్టోర్స్ ద్వారా వన్‌ప్లస్ 11R 5G ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


వన్‌ప్లస్ 11R 5G ఫోన్ ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే..
వన్‌ప్లస్ 11 5G ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్ 8+ 2 చిప్‌సెట్ ఉపయోగించగా.. కొత్తగా వస్తున్న వన్‌ప్లస్ 11R 5G ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్ 8+ 1 చిప్ సెట్ ఉపయోగించారు. అయితే పర్‌ఫార్మెన్స్ పరంగా రెండు కూడా ఒకే విధంగా ఉంటాయని మొబైల్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. 6.7 అంగుళాల OLED డిస్‌ప్లే, పంచ్ హోల్ డిజైన్, వన్‌ప్లస్ 9RT ఫోన్ తరహాలో కర్వ్ కలిగిన ఎడ్జిలు, స్మూత్ స్క్రోలింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం 120Hz స్పీడ్ రిఫ్రెష్మెంట్ ఫీచర్స్‌తో ఈ ఫోన్ తయారు చేశారు. 


వన్‌ప్లస్ 11R 5G ఫోన్‌లో 5,000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ అమర్చారు. 100W కెపాసిటీ కలిగిన ఫాస్ట్ చార్జర్ లభిస్తోంది. కేవలం 25 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ పూర్తి అవుద్దని వన్‌ప్లస్ కంపెనీ చెబుతోంది. వన్‌ప్లస్ ఫోన్స్ విషయంలో చెప్పుకోదగిన అంశం ఏంటంటే.. యాపిల్, శాంసంగ్ ఫోన్స్ తరహాలో కాకుండా ఇప్పటికీ ఫోన్‌తో పాటే చార్జర్‌ని ఆఫర్ చేస్తోంది. యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఫోన్‌తో పాటు చార్జర్‌ని అందివ్వడం ఎప్పుడో ఆపేశాయి. వన్‌ప్లస్ 11R 5G ఫోన్‌లో డాల్బి అట్మాస్ టెక్నాలజీని సపోర్ట్ చేసేలా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 


ఇక వన్‌ప్లస్ 11R 5G ఫోన్‌ కెమెరా సెటప్ విషయానికొస్తే.. వన్‌ప్లస్ 11R 5G ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో సెన్సార్ కెమెరాను ఇన్‌స్టాల్ చేశారు. అందమైన సెల్ఫీల కోసం వన్‌ప్లస్ 11R 5G ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.


ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు


ఇది కూడా చదవండి : Best Selling Hatchbacks: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే


ఇది కూడా చదవండి : OnePlus 10 Pro 5G Price: సూపర్ ఫీచర్స్ ఉన్న ఈ 5G ఫోన్ ధరపై రూ. 25 వేల వరకు భారీ డిస్కౌంట్


ఇది కూడా చదవండి : Samsung Galaxy S23 Ultra: ఈ 200MP కెమెరా సూపర్ స్మార్ట్ ఫోన్‌పై రూ. 8వేల డిస్కౌంట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook