OnePlus 10 Pro 5G Price: సూపర్ ఫీచర్స్ ఉన్న ఈ 5G ఫోన్ ధరపై రూ. 25 వేల వరకు భారీ డిస్కౌంట్

Know OnePlus 10 Pro 5G Price: కొద్ది రోజుల క్రితమే లాంచ్ అయిన వన్‌ప్లస్ 10  ప్రో 5G ధరను వన్‌ప్లస్ కంపెనీ భారీగా తగ్గించింది. అది కూడా రూ. 5 వేలు, రూ. 10 వేలు కాదు.. ఏకంగా రూ. 25 వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్టు వన్‌ప్లస్ కంపెనీ ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2023, 11:15 AM IST
OnePlus 10 Pro 5G Price: సూపర్ ఫీచర్స్ ఉన్న ఈ 5G ఫోన్ ధరపై రూ. 25 వేల వరకు భారీ డిస్కౌంట్

Huge Discount on OnePlus 10 Pro 5G in Amazon: స్మార్ట్ ఫోన్లలో ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఫోన్స్‌తో కస్టమర్స్‌ని ఆకర్షిస్తోన్న వన్‌ప్లస్ కంపెనీ ఇటీవల వన్‌ప్లస్ 11 5G సిరీస్ కింద రెండు కొత్త వేరియంట్స్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది. అందులో ఒకటి వన్‌ప్లస్ 11 5G కాగా మరొకటి వన్‌ప్లస్ 11R 5G ఫోన్. ఈ కొత్త ఫోన్స్ రాకతో అంతకంటే కొద్ది రోజుల క్రితమే లాంచ్ అయిన వన్‌ప్లస్ 10  ప్రో 5G ధరను వన్‌ప్లస్ కంపెనీ భారీగా తగ్గించింది. అది కూడా ఐదు వేలు, పది వేలు కాదు.. ఏకంగా రూ. 25 వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్టు వన్‌ప్లస్ కంపెనీ ప్రకటించింది.

గతేడాదే లాంచ్ అయిన వన్‌ప్లస్ 10  ప్రో 5G ధర రూ. 66,999 గా ఉండగా.. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమేజాన్‌లో ఈ ఫోన్‌పై ఇప్పుడు 9 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. అంటే 9 శాతం డిస్కౌంట్ తరువాత ఈ ఫోన్ రూ.60,999 కి లభిస్తోందన్నమాట. ఇదేకాకుండా అమేజాన్ వాళ్లు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద మరో రూ. 18,050 డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా వర్తించినట్టయితే.. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్‌ని రూ. 42,949 కే సొంతం చేసుకోవచ్చన్నమాట.

20.1:9 యాస్పెక్ట్ రేషియోతో 6.7 అంగుళాల QHD+ కర్వ్‌డ్ అమోల్డ్ డిస్ ప్లే, 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్యానెల్, 8 Gen 1 SoC స్నాప్ డ్రాగాన్ ప్రాసెసర్, 12GB RAM వంటి లేటెస్ట్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ సొంతం.

కెమెరా ఫీచర్స్ పరంగానూ వన్‌ప్లస్ 10  ప్రో 5G మొబైల్ కస్టమర్స్‌ని ఆకట్టుకుంటోంది. 48MP సోనీ ప్రైమరీ లెన్స్ కెమెరా, 50MP శాంసంగ్ ఐసోసెల్ జెన్1 సెన్సార్ కలిగి ఉన్న అల్ట్రావైడ్ లెన్స్ కెమెరా, 8MP టెలిఫోటో షూటర్ వంటి మూడు కెమెరాలను వెనుక భాగంలో అమర్చారు.

ఇది కూడా చదవండి : OnePlus 11 5G Phone: వాలెంటైన్స్‌ డే నాడే అమ్మకాలు ప్రారంభించిన వన్‌ప్లస్ 11 5G ఫోన్

ఇది కూడా చదవండి : Hyundai verna 2023: కేవలం రూ. 25 వేలు చెల్లించి కొత్త హ్యూందాయ్ కారు బుక్ చేసుకోండి

ఇది కూడా చదవండి : Samsung Galaxy S23 Ultra: ఈ 200MP కెమెరా సూపర్ స్మార్ట్ ఫోన్‌పై రూ. 8వేల డిస్కౌంట్

ఇది కూడా చదవండి : Okaya Faast F3 EV Scooter: మార్కెట్లోకి మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News