Oneplus: వన్‌ప్లస్ నుంచి అదిరిపోయే ఆఫర్లు..స్మార్ట్‌ఫోన్స్, టీవీలపై భారీ డిస్కౌంట్..!
Oneplus: పండగ సీజన్ వస్తున్న నేపథ్యంలో..కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్. దీపావళి సేల్ పేరుతో స్మార్ట్ ఫోన్స్, టీవీలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
Oneplus: స్మార్ట్ ఫోన్స్ కంపెనీలు పండగ సీజన్ లను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. దీనికి అనుగుణంగా పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తూ...వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్(Oneplus) దీపావళి సేల్ ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్స్, టీవీల కొనుగోలుపై భారీ డీల్స్‌ను, ఆఫర్లను కొనుగోలుదారులకు అందుబాటులో తీసుకవచ్చింది.
వన్‌ప్లస్ తన అధికారిక వెబ్‌సైట్‌లో దీపావళి సేల్(Diwali sale)ను నిర్వహిస్తోంది. వన్‌ప్లస్ 9 ప్రో , వన్‌ప్లస్ 9 ఆర్‌తో సహా , వన్‌ప్లస్ 9 శ్రేణిపై భారీ తగ్గింపు(discount)ను అందిస్తోంది. అదనంగా, వన్‌ప్లస్ నార్డ్ సిరీస్(Oneplus nord series)పై కూడా డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ప్రకటించింది. తొమ్మిది నెలల వరకు నోకాస్ట్ ఈఎమ్‌ఐ సదుపాయాన్ని కూడా వన్‌ప్లస్ అందించనుంది.
Mahindra Hyper Car: పినిన్ ఫరినాతో మహీంద్రా ఒప్పందం, మార్కెట్‌లో హైపర్ కారు త్వరలో
HDFC, SBI కార్డుపై భారీ తగ్గింపు
వన్‌ప్లస్ 9ఆర్, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్లపై రూ. 3000 తగ్గింపును ప్రకటించింది. దీంతో వన్‌ప్లస్ 9ఆర్ ధర రూ. 36,999, కాగా వన్‌ప్లస్ 9 రూ. 46,999 అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 9 ప్రోపై 4వేల తగ్గింపుతో రూ. 60,999 లభించనుంది. అమెజాన్(Amazon)లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో సుమారు 7 వేల తగ్గింపు ధరను అందిస్తోంది. అక్టోబర్ 4 నుంచి వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఎస్బీఐ కార్డులపై కూడా 7 వేల తగ్గింపు అందిస్తోంది.
వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు..
వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీ వై, యూ సిరీస్ శ్రేణి టీవీలపై 15 శాతం తగ్గింపును అందిస్తోంది. వన్‌ప్లస్ వై సిరీస్ 32-అంగుళాల టీవీ కొనుగోలుదారులకు రూ. 15,999కు లభించనుంది. అంతేకాకుండా అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై తక్షణ తగ్గింపు రూ. 2000 ను అందించనుంది. వన్‌ప్లస్ యూ సిరీస్ 50-అంగుళాల స్మార్ట్‌టీవీ రూ. 43,999 లభిస్తోంది. ఐసీఐసీఐ కార్డులపై అదనంగా రూ. 3 వేల తక్షణ తగ్గింపు అందుబాటులోకి రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook