Oppo A77 Smartphone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో పాటు 50 మెగాపిక్సెల్ రియల్ కెమేరాతో ఆకట్టుకుంటోంది. ఒప్పో ఏ77 ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒప్పో ఇండియాలో OPPO A77 లాంచ్ చేసింది.  ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతోపాటు 50 మెగాపిక్సెల్ రేర్ కెమేరా, లాంగ్ బ్యాటరీ ప్రత్యేకతలు. ఒప్పో ఏ77 డిజైన్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఫోన్ ధర ఎంత ఉంది, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం..


ఒప్పో ఏ77 ధర, ఫీచర్లు


ఒప్పో ఏ 77 సింగల్ మోడల్ లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర 15 వేల 499 రూపాయలు. ఇదే ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఒప్పో ఏ77 లో 6.56 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సిడి స్క్రీన్ పుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది హేలియో జి35 చిప్ సెట్‌‌తో వస్తోంది. ఇందులో 4 జీబీ ర్యామ్ ఉంటుంది. ఆండ్రాయిస్ 12 ఓఎస్‌‌తో పనిచేస్తుంది. మరో 4 జీబీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. 


ఒప్పో ఏ77 బ్యాటరీ సామర్ధ్యం


ఒప్పో ఏ77 లో 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పాటు 33 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా, 50 మెగాపిక్సెల్ రేర్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మైక్రో డెప్త్ సెన్సార్  కలిగి ఉంది. ఒప్పో ఏ77 యూజర్లకు స్టీరియో స్పీకర్, సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఇక ఇతర సౌకర్యాలు చూస్తే 4 జీ వోల్ట్, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బి సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.


Also read: Reliance Jio: రిలయన్స్ జియో కస్టమర్స్‌కు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే రీఛార్జ్ ప్లాన్‌పై రూ.150 తగ్గింపు



 స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook