PAN-Aadhaar link: రేపటితో మార్చి నెలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆర్థిక పరమైన పనులు పూర్తి చేసేందుకు రేపే చివరి తేదీ. ముఖ్యంగా పాన్​తో ఆధార్​ అనుసంధానం చేసేందుకు గురువారంతో (మార్చి 31) గడువు ముగియనుంది. ఇప్పటి వరకు పాన్​-ఆధార్​ అనుసంధానం పూర్తి చేయకుంటే.. వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరముంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ పాన్-ఆధార్ అనుసంధానం ఎందుకు అవసరం? గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే ఏమవుతుంది? అనే వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.


నిజానికి పాన్-ఆధార్​ లింక్​ గడువు 2021 సెప్టెంబర్​ 30తో ముగియాల్సి ఉంది. అయితే కొవిడ్ కారణంగా ఆ గడువును 2022 మార్చి 31 వరకు గడువును పొడగించింది ప్రభుత్వం. అంతకు ముందు కూడా గడువు పెంచింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు కొవిడ్ పరిస్థితులు దాదాపు సాధారణ స్థితికి చేరిన నేపథ్యంలో మరోసారి గడువు పెంచే అవకాశం లేదన వార్తలు వస్తున్నాయి.


అనుసంధానం ఎందుకు అవసరం?


ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం.. పాన్​-ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ). ఐటీఆర్ దాఖలు చేయాలన్నా పాన్​-ఆధార్ లింక్ తప్పనిసరి.


లింక్ చేయకుంటే ఏమవుతుంది?


రేపటిలోపు పాన్​-ఆధార్ అనుసంధానం చేయకుంటే.. పాన్​ ఇన్​ యాక్టివ్​గా మారిపోవచ్చు. గడువు తర్వాత లింక్ చేయాలనుకుంటే రూ.1000 వరకు జరిమానా పడొచ్చు. లేదా రూ.10 వేల వరకు సీబీడీటీ జరిమానా విధించొచ్చు.


ఈ సమస్యలు రావద్దంటే వీలైనంత త్వరాగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్​కం ట్యాక్స్​ వెబ్​సైట్లోకి వెల్లి సులబంగా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చని అంటున్నారు. పాన్​-ఆధార్ లింక్ అయ్యిందా? లేదా? అనే విషయాన్ని కూడా అక్కడ తెలుసుకోవచ్చు.


Also read: Axis bank: యాక్సిస్ చేతికి సిటీగ్రూప్​ రిటైల్ వ్యాపారాలు - డీల్​ విలువ ఎంతంటే?


Also read: DA Hike: ఉద్యోగులకు గుడ్​ న్యూస్​- మరో 3 శాతం పెరిగిన డీఏ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook