Axis bank: యాక్సిస్ చేతికి సిటీగ్రూప్​ రిటైల్ వ్యాపారాలు - డీల్​ విలువ ఎంతంటే?

Axis bank: భారత్​లో సిటీ గ్రూప్​ రిటైల్ వ్యాపారాలను ఏ సంస్థ కొనుగోలు చేస్తుందనే విషయంపై మరో అప్​డేట్ వచ్చింది. యాక్సిస్​ బ్యాంక్​, సిటీ గ్రూప్​ మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డీల్ విలువ ఎంతంటే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 05:47 PM IST
  • త్వరలో యాక్సిస్ బ్యాంక్ చేతికి సిటీ గ్రూప్ రిటైల్ వ్యాపారాలు
  • రెండు సంస్థల మధ్య ఒప్పందం ఖరారైనట్లు వార్తలు..
  • త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని అంచనాలు
Axis bank: యాక్సిస్ చేతికి సిటీగ్రూప్​ రిటైల్ వ్యాపారాలు - డీల్​ విలువ ఎంతంటే?

Axis bank: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్​ బ్యాంక్​.. మరో ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ సిటీ గ్రూప్ రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్​ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.ఇక ఈ డీల్​ గురించి అవగాహన ఉన్న వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. 2.5 బిలియన్ డాలర్ల (రూ.18 వేల కోట్లు)తో సిటీ గ్రూప్​ రిటైల్ వ్యాపారాలను

యాక్సిస్ గ్రూప్ దక్కించుకోనున్నట్లు తెలిసింది. 2021 ఏప్రిల్​లో.. భారత్​లో రిటైల్ వ్యాపారాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సిటీ గ్రూప్​ అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు కూడా వెల్లడించింది. దీనితో సిటీ రిటైల్ వ్యాపారాలను ఏ సంస్థ కొనుగోలు చేస్తుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోటక్ మహీంద్రా సహా వివిధ బ్యాంకుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. తాజాగా యాక్సిస్​ బ్యాంక్​ ఇందుకు సిద్ధమైనట్లు సమాచారం.

సిటీ గ్రూప్ రిటైల్ వ్యాపారాలు..

సిటీ గ్రూప్ రిటైల్​ వ్యాపారాల్లో.. క్రెడిట్​ కార్డ్స్​, రిటైల్​ బ్యాంకింగ్, హోం లోన్స్​, వెల్త్​ మేనేజ్​మెంట్​, వంటి సేవలు ఉన్నాయి. భారత్​లో సిటీ గ్రూప్​కు 35 బ్రాంచ్​లు, 4.000 మంది ఉద్యోగులు ఉన్నారు.

సిటీ గ్రూప్​ 1902లో భారత్​లోకి ప్రవేశించింది. 1985లో బ్యాంకింగ్ బిజినెస్ సేవలు ప్రారంభించింది.

యాక్సిస్​ బ్యాంక్ సిటీ గ్రూప్​ మధ్య ఒప్పందానికి నియంత్రణ పరమైన అనుమతులు లభిస్తే.. బ్యాంకింగ్ వ్యాపారాల్లో యాక్సిస్​ పరిది మరింత విస్తరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. యాక్సిస్​ బ్యాంక్ సిటీ గ్రూప్​ మధ్య డీల్ గురించి ఈ-మెయిల్ ద్వారా ప్రశ్నించగా అందుకు స్పందన రాలేదని తెలిపారు విశ్లేషకులు.

Also read: DA Hike: ఉద్యోగులకు గుడ్​ న్యూస్​- మరో 3 శాతం పెరిగిన డీఏ!

Also read: Petrol price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు- హైదరాబాద్​లో సెంచరీ కొట్టిన డీజిల్​..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News