Aadhar PAN Link Last Date: సమయం లేదు మిత్రమా.. 10 రోజుల్లో ఈ పనిచేయకపోతే పాన్ కార్డు చెత్త బుట్టలో వేయండి
Link Pan - Aadhar: మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయలేదా..? మీకు మార్చి 31వ తేదీ వరకే సమయం ఉంది. ఆ రోజులోపు లింక్ చేయకపోతే మీ పాన్ చెత్త బుట్టలో పాడేయాల్సిందే. ఆధార్‌తో పాన్‌ను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా లింక్ చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Pan Aadhar Link Last Date: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేలోపు (మార్చి 31) ముఖ్యమైన పనులు పూర్తి చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. వీటిలో అతి ముఖ్యమైనది ఆధార్ కార్డుతో పాన్ నంబరు లింక్ చేయడం. ఈ పని వెంటనే పూర్తి చేయాలని ఆదాయపు పన్ను శాఖ ప్రజలకు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది. మీరు ఇంకా పాన్, ఆధార్ లింక్ చేయకుంటే.. ఈరోజే కంప్లీట్ చేయండి.
మార్చి 31వ తేదీలోపు పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌కి లింక్ చేయకపోతే.. పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్ అవుతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాన్ కార్డు పని చేయదు. అంతేకాదు గడువు కంటే ముందు మీ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకపోతే.. ఇందుకోసం రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది.
ప్రయోజనాలు ఇవే..
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడం ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. పాన్-ఆధార్ లింక్ అయితే.. ఐటీఆర్ ఫైల్ చేయడం సులభం అవుతుంది. అదేవిధంగా అన్ని ట్రాన్సిక్షన్లను అడిట్ చేసేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సులభంగా ఉంటుంది. ట్రాన్సాక్షన్ల రిసిప్టులు, ఈ సిగ్నేచర్ వంటివి ఆదాయ పన్ను శాఖకు అందించాల్సిన పని ఉండదు. ఆధార్ ఈ-వెరిఫికేషన్ ద్వారా అన్ని ఆటోమెటిక్‌గా అయిపోతాయి. పాన్ కార్డు ద్వారా జరిగే మోసాలకు కూడా చెక్ పడనుంది. ఒకవేళ మీ పేరుపై ఎవరైనా ఆధార్ తీసుకున్నా.. అది క్యాన్సిల్ అవుతుంది.
ఇలా లింక్ చేయండి..
==> ఇప్పటికే మీ పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేసి ఉంటే.. మీ స్టేటస్‌ని చెక్ చేసుకోండి.
==> ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ www.incometaxindiaefiling.gov.in కొత్త వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal కి వెళ్లండి .
==> ఇక్కడ ఉన్న 'లింక్ ఆధార్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> మీ స్టాటస్‌ను చెక్ చేసుకోవడానికి 'ఇక్కడ క్లిక్ చేయండి' అనే ఆప్షన్‌పై ఎంచుకోండి.
==> ఇక్కడ మీ ఆధార్, పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయండి.
==> మీ పాన్ కార్డ్ ఇప్పటికే ఆధార్ కార్డ్‌కి లింక్ చేసి ఉంటే.. లింక్ చేసినట్లు మీకు డిస్‌ప్లేపై కనిపిస్తుంది.
==> మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ కానట్లయితే.. https://www.incometaxindiaefiling.gov.in/home లింక్‌పై క్లిక్ చేయండి.
==> ఇక్కడ ఆధార్, పాన్ వివరాలను ఎంటర్ చేయండి
==> లింక్ నౌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> ఆ తర్వాత మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసినట్లు మెసేజ్ వస్తుంది.
ఆధార్-పాన్ లింక్ SMS ద్వారా ఇలా..
మీకు స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లేకపోతే.. మీరు SMS ద్వారా పాన్, ఆధార్ కార్డ్‌ను కూడా లింక్ చేయవచ్చు. మీరు SMS సేవను ఉపయోగించాలనుకుంటే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి UIDPAN <12-అంకెల ఆధార్> <10-అంకెల PAN> అని టైప్ చేసి 567678 లేదా 561561కి SMS పంపండి. ఇలా చేసిన తర్వాత.. లింక్ గురించి సమాచారం మీకు మెసేజ్ వస్తుంది.
Also Read: Deepthi Sunaina : బ్లాక్ చేశాడంటూ ఎమోషనల్.. వేడుకుంటోన్న దీప్తి సునయన
Also Read: Niharika Konidela Divorce : ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook