How To Secure Pan Card​: బ్యాంకు లావాదేవీలు ఏవి జరపాలన్నా పాన్ కార్డు చాలా అవసరం. అంతేకాకుండా ఆధార్ కార్డులానే గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది.ఆర్ధిక లావాదేవీలు ఏవి చేయాలన్నా పాన్ కార్డు అవసరమౌతుంది. ఈ క్రమంలో పాన్ కార్డు వివరాలు మీరు ఎక్కడైనా ఇస్తుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మీ పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశముంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలిసో తెలియకో రుణాల కోసం, క్రెడిట్ కార్డుల కోసం ఎక్కడ పడితే అక్కడ, ఎవరడిగితే వారికి పాన్ కార్డు వివరాలు ఇచ్చేస్తుంటాం. దీనివల్ల వివిధ రకాల నేర ప్రయోజనాలు జరగవచ్చు. మీ పాన్ కార్డును అసాంఘిక కార్యకలాపాలకు, దొంగతనాలకు ఉపయోగిస్తే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. మీ పాన్ కార్డును మీకు తెలియకుండా అక్రమ కార్యకలాపాలకు ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు, ఎస్ఎంఎస్ ద్వారా ఫిషింగ్ స్కామ్ , ఇతరుల పేర్లతో క్రెడిట్ కార్డులు తీసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. మీ కార్డు విషయంలో ఇలాంటివి జరిగినట్టు తెలిస్తే వెంటనే జరిగిన మోసం గురించి సంబంధిత అధికారులు, పోలీసులు, ఇన్ కంటాక్స్ శాఖకు తెలియజేయాలి. ముందుగా ఆదాయపు పన్ను శాఖ నెట్వర్క్ పోర్టల్ ఓపెన్ చేసి కస్టర్ కేర్ విభాగంలో ఫిర్యాదు చేయాలి. మీకు జరిగిన మోసాన్ని వివరించి క్యాప్చా నమోదు చేసి ఫామ్ సబ్మిట్ చేయాలి.


మీ పాన్ కార్డు ఎంత వరకు భద్రమూ ఇలా చెక్ చేయండి


మీ పాన్ కార్డు మీకు తెలియకుండా ఎవరైనా మోసపూరిత లావాదేవీలకు పాల్పడుతుంటే ఆన్ లైన్ ద్వారా ఇలా తెలుసుకోవచ్చు. దీనికోసం క్రెడిట్ బ్యూరో వెబ్ సైట్ లో ముందు మీ క్రెడిట్ స్కోరు చెక్ చేయండి. దీనికోసం మీ పాన్ కార్డు వివరాలు ఎంటర్ చేసి ఓటీపీ ధృవీకరించండి. మీ పాన్ కార్డు దుర్వినియోగమయుంటే అందులో వచ్చే వివరాల్లో తెలిసిపోతుంది.


పాన్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఎక్కడ పడితే అక్కడ పాన్ కార్డు వివరాలు ఇవ్వకూడదు. యూఆర్ఎల్ httpsతో ప్రారంభమయ్యే వెబ్ సైట్స్ లో మాత్రమే పాన్ కార్డు నెంబర్ ఇవ్వాలి. అనుమానాస్పద పోర్టల్స్ లో మీ వ్యక్తిగత సమాచారం నమోదు చేయవద్దు. క్రెడిట్ స్కోరు చెక్ చేయడం ద్వారా వివరాలు తెలుసుకోవాలి. పాన్ కార్డు లింక్ అయిన వివరాల కోసం ఫామ్ 26ఏఎస్ చెక్ చేసుకోవాలి.


Also read: HONOR X60i Launch: 12GB Ram, 50MP కెమేరా అద్భుత డిజైన్ తో హానర్ కొత్త ఫోన్ అతి తక్కువ ధరకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook