How To Update PAN Card: పాన్ కార్డుపై పేరు, పుట్టిన తేదీ వివరాలు ఇలా మార్చుకోండి
PAN Card Update Online: పాన్ కార్డుకు సంబంధించిన పనులన్నీ సజావుగా సాగాలంటే పాన్ కార్డు మీద ఉన్న పేరు, పుట్టిన తేదీ కరెక్ట్‌గా ఉండాలి. మరి అవి తప్పుగా ఉంటే ఇలా ఈజీగా సరిదిద్దుకోవచ్చు.
NSDL PAN Card Update: బ్యాంక్ ఖాతా తెరవాలన్నా.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా.. ఐటీఆర్ ఫైల్ చేయాలన్నా... ఇలా చాలా విషయాలకు పాన్ కార్డు చాలా అవసరం ఉంటుంది. అయితే కొందరి పాన్ కార్డులపై పేరు లేదంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటాయి. ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా పాన్ కార్డుపై (PAN Card) తప్పుగా ఉన్న పేరును, డేట్ ఆఫ్ బర్త్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. పాన్ కార్డుపై పేరు లేదా పుట్టిన తేదీని (Date of Birth) అప్‌డేట్ చేయడానికి ఇలా చేయండి.. ముందుగా, ఎన్‌ఎస్‌డీఎల్ (NSDL) వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. లేదంటే ఇక్కడ ఇచ్చిన డైరెక్ట్ లింక్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ద్వారా అయిన లాగిన్ అవ్వండి.
ఎన్‌ఎస్‌డీఎల్ వెబ్‌సైట్ ఓపెన్ చేశాక అందులో టాప్‌లో ఎడమ వైపున ఉన్న 'అప్లికేషన్ టైప్'లోకి వెళ్లి, డ్రాప్ డౌన్ ద్వారా 'ఛేంజెస్ ఆర్ కరెక్షన్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా/ పాన్ కార్డ్ రీప్రింట్' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. తర్వాత మీ పాన్ కార్డు కేటగిరీని ఎంచుకోండి. అప్లికేషన్ మెనుకి వెళ్లండి. పేరు, పుట్టిన తేదీ, ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, మీ పాన్ కార్డు నంబర్‌ను వివరాలను ఫిల్ చేయండి. అలాగే క్యాప్చాను ఎంటర్ చేసి.. సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
అయితే ఈ మార్పులు చేర్పులు చేసేందుకు ఛార్జీలు వసూలు చేస్తారు. ఒకసారి మార్పులు చేసింనందుకుగాను రూ.96 (రూ. 85 అప్లికేషన్ ఛార్జీలతో పాటు 12.36 శాతం సర్వీస్ ట్యాక్స్) చెల్లించాల్సి ఉంటుంది.
ఇక అమౌంట్ చెల్లించిన తర్వాత దరఖాస్తుదారుడికి బ్యాంక్ (Bank) రిఫరెన్స్ నంబర్‌తో పాటు ట్రాన్జాక్షన్ నంబర్ వస్తుంది. రెండింటినీ సేవ్ చేసి.. 'కొనసాగించు' బటన్‌పై క్లిక్ చేయండి. 'ఆధార్ కార్డ్' (Aadhaar Card) దిగువన ఉన్న బాక్స్‌లో 'అథెంటికేట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఈ కేవైసీ ధ్రువీకరణ కోసం 'కంటిన్యూ విత్ ఇ-సైన్' పై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంట్రీ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక ఒక కొత్త ట్యాబ్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఒక కొత్త ఫామ్ కనపడుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి.. ప్రింట్ తీసుకోవాలి. ఆ ప్రింట్‌కు ఆధార్, ఇతర కేవైసీ పత్రాలను జతచేసి .. ఎన్ఎస్‌డీఎల్ ఈ గవర్నమెంట్ ఆఫీస్, బిల్డింగ్-1, 409-410, ఫోర్త్ ఫ్లోర్, బరాఖంబా రోడ్, న్యూఢిల్లీ, పిన్ : 110001కు పంపాలి. ఇలా ప్రాసెస్ మొత్తం పూర్తి చేస్తే మీరు మార్పులు చేర్పులు చేసిన పేరు, డేట్ ఆఫ్ బర్త్‌తో కొత్త పాన్ కార్డు (PAN Card) పొందుతారు.
Also Read: CM Jagan on Probation: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ తీపికబురు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook