Budget Session 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (జనవరి 31) ప్రారభం కానున్నాయి. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ సమావేశాలు కాస్త ప్రత్యేకంగా జరగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమావేశాల ప్రారభమయ్యాక తొలి రెండు రోజులు మినహా.. మిగతా రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభలు వేర్వేరు సమయాల్లో షిఫ్టుల వారీగా పని చేయనున్నాయి. మరోవైపు గత ఏడాదిలానే ఈ సారీ పేపర్​లెస్​ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.


రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.. మొదటి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు.. రెండో దశ మార్చి 14 నుంచి ఏప్రిల్​ 8 వరకు జరగనుంది.


మొదటి దశలో తొలి రోజు ఇలా..


తొలి రోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్ కోవిడ్​ ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టనున్నారు.


ఏమిటి ఈ ఆర్థిక సర్వే?


గత ఏడాది బడ్జెట్​ సమయంలో పెట్టుకున్న లక్ష్యాలు, సాధించిన విజయాలతో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంచనాలతో కూడుకున్నదే ఆర్థిక సర్వే. ఈ సర్వేను ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అధ్యక్షతన ఆర్థిక నిపుణులతో కూడిన బృందం తయారు చేస్తుంది.


వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాల్సిన విధానాలపై కూడా ఈ సర్వే ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. దేశ ప్రస్తుత ఆర్థిక స్థితిపై పూర్తి అవగాహన ఇచ్చే విధంగా ఈ సర్వే ఉపయోగపడుతుంది.


రెండో రోజు బడ్జెట్​..


రెండో రోజు (ఫిబ్రవరి 1న) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్ 2022పై ప్రసంగం చేయనున్నారు. ఈ ప్రసంగాం సహా బడ్జెట్​లో కేటాయింపులను సామాన్యులు సైతం తెలుసుకునే విధంగా 'యూనియన్ బడ్జెట్ యాప్​'ను ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.


ఉభయ సభల షిఫ్టులు ఇలా..


ఇక ఫిబ్రవరి రెండవ తేదీన నుంచి ఉభయ సభలు వేర్వేరు సమాల్లో భేటీ కానున్నాయి. ఒక్కో సభ రోజుకు 5 గంటల చొప్పున మాత్రమే పని చేయనుంది.


పార్లమెంట్​ సిబ్బంది పెద్ద ఎత్తున కరోనా బారిన పడటం, ప్రస్తుతం దేశంలో భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది పార్లమెంట్ వ్యవహారాల విభాగం.


మొదట షిఫ్టులో రాజ్య సభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భేటీ కానుంది.


ఆ తర్వాత రెండో షిఫ్టులో సాయంత్రం 4 గంటల నంచి రాత్రి 9 గంటల వరకు లోక్​ సభ సమావేశమవనుంది.


Also read: Budget 2022 Expectations: బడ్జెట్ 2022లో ఆ నిర్ణయం ఉంటే.. పెరగనున్న టెక్​ హోం శాలరీ!


Also read: Moto G60 for RS 149: కేవలం రూ.149లకే Moto G60 స్మార్ట్ ఫోన్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook