Passport Apply Process: పాస్‌పోర్ట్ అనేది వేర్వేరు దేశాల ప్రయాణాన్ని ఆధికారికం చేసేందుకు, ఐడీ కార్డుగా, సిటిజన్ షిప్ కార్డుగా, విదేశంలో సెక్యూరిటీ కల్పించేదిగా, తిరిగి స్వదేశంలో ప్రవేశించేందుకు అత్యవసరం. ఇంత కీలకమైన పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే పద్ధతి ఏంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవరైనా ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలనుకుంటే కచ్చితంగా కావల్సింది పాస్‌పోర్టు. ఓ దేశం ఆ దేశ నాగరికుడికి ఇచ్చే గుర్తింపు కార్డు. విదేశాలకు వెళ్లినప్పుడు పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ఆ దేశంలో ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా తిరిగి స్వదేశానికి కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. అందుకే పాస్‌పోర్ట్ కలిగి ఉండటం, భద్రపర్చుకోవడం రెండూ చాలా ముఖ్యం. ఇప్పుడు పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్‌‌లో కూడా అప్లై చేయవచ్చు. ఇంట్లో కూర్చునే సులభమైన పద్ధతుల ద్వారా ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయవచ్చు. 


ఆన్‌లైన్ విధానంలో పాస్‌పోర్ట్ కోసం ఎలా దరఖాస్తు చేయడం


ముందుగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఆన్‌లైన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇందులో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. వివరాలు సమర్పించి రిజిస్టర్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తిరిగి మీరు సమర్పించిన క్రెడెన్షియల్స్ సహాయంతో లాగిన్ కావాలి. కొత్త పాస్‌పోర్ట్ కోసం లేదా పాస్‌పోర్ట్ రీ ఇష్యూ అనే లింక్ క్లిక్ చేయాలి. దరఖాస్తులో అవసరమైన వివరాలు పూర్తి చేసి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.


ఆ తరువాత ఆపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసేందుకు వ్యూ సేవ్డ్ లేదా సబ్మిటెడ్ అప్లికేషన్స్ స్క్రీన్‌పై పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్స్ లింక్ క్లిక్ చేయాలి. అప్లికేషన్ ప్రింట్ రిసీప్ట్ తీసుకోవాలి. పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లే సమయంలో అప్లికేషన్ వివరాలతో పాటు ఎస్ఎంఎస్ అపాయింట్మెంట్ ధృవీకరణ కూడా సరిపోతుంది. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. 


ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసేందుకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు అనివార్యం. చెల్లింపును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ బ్యాంక్ చలాన్ ద్వారా చేయవచ్చు.


Also read: Aadhaar Card Update: ఆధార్ కార్డులో పుట్టినతేదీ వివరాలు మార్చాలంటే ఏం చేయాలి, ఏం కావాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook