Paytm: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆవిష్కరించిన 'ప్రధాన మంత్రుల మ్యూజియం' అధికారిక పేమెంట్స్​ భాగస్వామిగా ప్రముఖ ఫిన్​టెక్ కంపెనీ పేటీఎం నిలిచింది. ఈ విషయాన్ని పేటీఎం అధికారికంగా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏమిటి ఈ ప్రధానమంత్రుల మ్యూజియం..


స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానులుగా పనిచేసినవారి గౌరవార్ధం నిర్మించిందే ఈ ప్రధాన మంత్రుల మ్యూజియం (ప్రధానమంత్రి సంగ్రహాలయం). ఢిల్లీ తీన్​ మూర్తి ఎస్టేట్​లో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియాన్ని.. ప్రధాని మోదీ గురువారం అధికారికంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మ్యూజియంలోకి ప్రవేశించేందుకు పేటీఎం ఎలక్ట్రానిక్ డేటా క్యూప్చర్​ మిషిన్​ ద్వారా టికెట్​ కొనుగోలు చేసిన వ్యక్తి ప్రధాని మోదీనే అని పేటీఎం ప్రకటించింది.


ఈ మ్యూజియంలో భారత ప్రధానులందరి జీవిత విశేషాలు.. అప్పటి పరిస్థితులు.. దేశ అభివృద్ధిలో ఎదురైన సవాళ్లు ఇలా అనేక విశేషాలను ఈ మ్యూజియం ద్వారా తెలుసుకునే వీలుంది.


ఈ సందర్భంగా.. పేటీఎం గేట్​వే ఈడీసీ (ఎలక్ట్రానిక్ డేటా క్యాప్చర్) మెషీన్‌లు, క్యూఆర్ కోడ్ పేమెంట్ ఆప్షన్‌ల ద్వారా వేగవంతమైన, సురక్షితమైన పేమెంట్ సదుపాయాలను ఇస్తున్నట్లు పేర్కొంది పేటీఎం.


మ్యూజియం సందర్శించేందుకు టికెట్ ధర ఎంతంటే?


ప్రధాన మంత్రి సంగ్రహాలయం సందర్శించేందుకు టికెట్ ధర రూ.100గా నిర్ణయించారు అధికారులు. అయితే ఆన్​లైన్ పేమెంట్​ చేసేవారికి మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. ఆఫ్​లైన్​లో టికెట్ కొంటే రూ.110 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. అదే విదేశీయులు ఈ మ్యూజియం సందర్శించాలంటే రూ.750 చెల్లించి టికెట్​ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


ఇక 5 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలకు టికెట్ ధరలో 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని పేటీఎం వివరించింది. ఇక స్కూళ్లు, కాలేజీ విద్యార్థుల కోసం యాజమాన్యం టికెట్స్ బుక్​ చేస్తే.. 25 శాతం తగ్గింపు పొందొచ్చని తెలిపింది.


Also read: Virtual Reality: రూ.800 ఖర్చుతో ఇంట్లోనే 3D సినిమాలను చూసేయోచ్చు.. అదెలాగో తెలుసా?


Also read: RealMe Offer: రియల్ మీ జీటీ 2 ప్రో.. భారీ డిస్కౌంట్ ఆఫర్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook