Petrol, Diesel Price In Hyderabad Today, July 11, 2021: దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు ఇంధనధరలు వాహనదారులకు మంట పెడుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు సెంచరీలు కొడుతున్నాయి తప్ప ఇంధన ధరలు తగ్గేలా కనిపించడం లేదు. కానీ నేడు వాహనదారులకు ఇంధన ధరలు స్వల్ప ఊరట కలిగించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు పెరగగా, డీజిల్‌పై 26 పైసల చొప్పున పెరగడంతో  లీటర్ పెట్రోల్ ధర రూ. 100.91 చేరగా, డీజిల్ ధర రూ. 89.88కు చేరుకుంది. నేడు సైతం నిన్నటి ధరలతో విక్రయాలు జరుగుతున్నాయి. జులై నెలలో ఇప్పటికే 7 పర్యాయాలు ఇంధన ధరలు పెరగడం గమనార్హం. మే, జూన్ నెలల్లో 16 పర్యాయాలు ఇంధన ధరలు (Petrol Price In Hyderabad) పెరగడంతో వాహనదారులు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలలో ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, లడఖ్, పంజాబ్, తమిళనాడు, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు నాగాలాండ్, బిహార్, ఢిల్లీ మరియు కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోల్ ధర సెంచరీ మార్కు దాటింది.


Also Read: EPFO Medical Advance: గంటలో ఈపీఎఫ్‌వో మెడికల్ అడ్వాన్స్‌గా రూ.1 లక్ష సాయం


హైదరాబాద్‌లో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.104.86 చేరగా, డీజిల్ ధర రూ. 97.96కు చేరుకుంది. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌ (Hyderabad)లోనే డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. జులై 11న నిన్నటి ధరలతో పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.93 కాగా, డీజిల్ ధర రూ.97.46 అయింది. ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.93, లీటర్ డీజిల్‌ ధర రూ.99.46 అయింది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.104.29, డీజిల్ ధర రూ.95.26కు చేరుకుంది. 


Also Read: Block Your Number: మీ మొబైల్ నెంబర్‌ను బ్లాక్ చేసుకున్నారా, Caller IDని ఇలా హైడ్ చేసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook