Golconda Bonalu 2021: గోల్కొండ బోనాలు ప్రారంభం, ఘనంగా జరుపుకోవాలని Chiranjeevi విషెస్

Golconda Bonalu 2021: గతేడాది కరోనా కారణంగా బోనాల సంబరం సాధారణంగా జరిగింది. ఈ ఏడాది మళ్లీ పోతరాజుల నృత్యాలు, భక్తుల కోలాహలం, తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. బోనాల పండుగ 2021 ప్రారంభం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 11, 2021, 02:22 PM IST
Golconda Bonalu 2021: గోల్కొండ బోనాలు ప్రారంభం, ఘనంగా జరుపుకోవాలని Chiranjeevi విషెస్

Golconda Bonalu 2021: తెలంగాణలో భిన్న సంస్కృతులు, వర్గాలను ఏకం చేసే ఉత్సవాలు బోనాలు. నేటి నుంచి హైదరాబాద్‌లో గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. మొదటగా గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలతో నగరంలో బోనాల పండుగ మొదలవుతుంది. ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం కూడా నేడు ప్రారంభమవుతుంది. 

గతేడాది కరోనా కారణంగా సాధారణంగా బోనాల సంబరం జరిగింది. ఈ ఏడాది మళ్లీ పోతరాజుల నృత్యాలు, భక్తుల కోలాహలం, తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారిని చోటాబజార్‌లోని పూజారి ఇంటికి తీసుకెళతారు. అక్కడ అమ్మవారి అలంకరణ తరువాత ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య గోల్కొండ కోటపైకి తీసుకెళ్లి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టిస్టారు. బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read; Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 11 జులై 2021, Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

‘బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు. వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అగ్రనటుడు చిరంజీవి ట్వీట్ చేశారు.

Also Read: Roar Of RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్, జులై 15న గెట్ రెడీ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News