Petrol price: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంంగా ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటాయి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు. ప్రతి రోజు ఉదయం తాజా రేట్లను అమలులోకి తెస్తుంటాయి. మరి నేడు ధరలు ఎలా ఉన్నాయి? ఏ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ రేట్లు అత్యధికంగా ఉన్నాయి? ఎక్కడ రేట్లు తక్కువ ధర ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వం రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియాన్ ఆయిల్​ కార్పొరేషన్ ప్రకారం.. పెట్రోల్ ధర లీటర్​ అత్యల్పంగా పోర్ట్​ బ్లెయర్​లో రూ.91.45గా వద్ద విక్రయమవుతోంది. అత్యధికంగా పరబనిలో లీటర్​ పెట్రోల్ ధర రూ.123.47గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.105.41వద్ద ఉన్నట్లు తెలిసింది.
మార్చి 22 నుంచి వరుసగా 14 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ పెరిగాయి. దీనితో ఇంధన ధరలు అంతకు ముందుతో పోలిస్తే రూ.10.20 ప్రియమయ్యాయి.


ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..


  • హైదరాబాద్​లో పెట్రోల్ ధర రూ.119.47 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.105.47 వద్ద కొనసాగుతోంది.

  • ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ ధర లీటర్​రూ.96.67

  • ముంబయిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా రూ.120.51, రూ.140.77 వద్ద ఉన్నాయి.

  • చెన్నైలో పెట్రోల్ లీటర్​ ధర రూ.110.85, డీజిల్ ధర లీటర్​ రూ.100.94గా ఉన్నాయి

  • కోల్​కతాలో పెట్రోల్ ధర రూ.115.12, డీజిల్ ధర రూ.99.83


రోజువారీ రేట్లు తెలుసుకోవడం ఎలా?


ఎస్​ఎంఎస్​ ద్వారా రోజువారీ పెట్రోల్, డీజిల్ రేట్లను సులభంగా తెలుసుకోవచ్చు. ఇండియాన్ ఆయిల్ కార్పొరేషన్ కస్టమర్లు RSP అని 9224992249, భారత్​ పెట్రోలియం కస్టమర్లు RSP అని 9223112222కు, హెచ్​పీసీఎల్​ కస్టమర్లు HPPrice అని 9222201122కు ఎస్​ఎంఎస్​ పంపాలి. దీనితో ప్రస్తుత రేట్ల వివరాలను ఎస్​ఎంఎఎస్​ ద్వారా పొందొచ్చు.


Also read: BSNL Recharge: BSNL బంపర్ ఆఫర్.. రూ.797 రీఛార్జ్ ప్లాన్ తో 395 రోజుల వ్యాలిడిటీ!


Also read: Xiaomi 11i 5G Flipkart: రూ.30 వేల విలువైన Xiaomi 5G మొబైల్ ను రూ.10 వేలకే కొనండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook