Petrol rate in India: దేశంలో ఆగని పెట్రో మంట- కోల్‌కతాలో రూ.100 దాటిన లీటర్ డీజిల్ ధర
Petrol rates today: దేశంలో ఇంధన ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. గురువారం పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి పెరిగాయి. కోల్‌కతాలో కూడా డీజిల్ ధర రూ.100 దాటింది.
Petrol Price in India: పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గురువారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను (Fuel price hiked) పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలకు అనుగుణంగానే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చెబుతున్నాయి.
ఇప్పటికే జీవనకాల గరిష్ఠం వద్ద కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు గురువారం మరో కొత్త రికార్డు స్థాయికి చేరాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు
హైదరాబాద్‌లో పెట్రోల్ (Petrol price in Hyderabad) ధర లీటర్ 36 పైసలు పెరిగి.. రూ.112.59 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర (Diesel Price in Hyderabad) 38 పైసలు పెరిగి.. రూ.105.80 వద్ద ఉంది.
విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 35, 36 పైసల చొప్పున పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర (Petrol price in Vizag) రూ.113.33 వద్ద, డీజిల్ ధర (Diesel price in Vizag) రూ.105.96 వద్ద ఉన్నాయి.
Also read: LPG Price hike: మరోసారి వంట గ్యాస్ ధరల మంట- వచ్చే వారం రూ.100 వరకు పెరిగే అవకాశం!
Also read: 5G Network: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ మరింత ఆలస్యం కానుందా, కారణమేంటి
ఇతర మెట్రో నగరాల్లో ఇంధన ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Delhi) 35 పైసలు, డీజిల్ ధర లీటర్ 35 పైసలు పెరిగింది. దీనితో పెట్రోల్, డీజిల్ (Diesel Price in Delhi) ధరలు లీటర్‌కు వరుసగా.. రూ.108.29, రూ.97.03 వద్ద ఉన్నాయి.
చెన్నైలో పెట్రోల్ ధర (Petrol Price in Chenni) లీటర్ 31 పైసలు పెరిగి.. రూ.105.10 వద్ద ఉంది. లీటర్ డీజిల్ (Diesel Price in Chenni) ధర 34 పైసలు పెరిగి.. రూ.101.22 వద్దకు చేరింది.
బెంగళూరులో పెట్రోల్ ధర (Petrol Price in Bengaluru) లీటర్ 36 పైసలు పెరిగి రూ.112.02 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగి (Diesel Price in Bengaluru) రూ.102.94 వద్దకు చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర లీటర్ 34 పైసలు పెరిగి (Petrol Price in Mumbai)రూ.114.10కి చేరింది. లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగి రూ.105.08 వద్ద (Diesel Price in Mumbai) కొనసాగుతోంది.
కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటర్‌కు.. 34 పైసలు, 35 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్ (Petrol Price in Kolkata) పెట్రోల్ ధర రూ.108.75 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్ (Diesel Price in Kolkata) రూ.100.10 వద్ద కొనసాగుతోంది.
రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయి వద్ద ఉన్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.120.42 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర రూ.113.09వద్ద ఉంది.
Also read: PhonePe transaction charges: ఫోన్ పే యూజర్స్‌కి షాక్.. మొబైల్ రీచార్జీపై ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు
Also read: Matchbox Price: అగ్గిపెట్టె రూ.2.. డిసెంబరు 1 నుంచి అమలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook